Abn logo
Mar 27 2020 @ 05:33AM

29 నుంచి రేషన్‌ సరుకులు పంపిణీ

ఉండి: కరోనా వైరస్‌ దృష్ట్యా ఈనెల 29 నుంచి రేషన్‌ కార్డుదారులకు సరుకులను పంపిణీ చేస్తామని తహసీల్దార్‌ కృష్ణజ్యోతి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బియ్యం, కందిపప్పు ఉచితంగా అందిస్తామని, పంచదారకు రూ.10 చెల్లించాలన్నారు. రేషన్‌కు ఒకరు మాత్రమే రావాలన్నారు.


మండలంలో 36 రేషన్‌ షాపులలో ఈ నెల 29 నుంచి రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తారని తహసీల్దార్‌ వై.దుర్గాకిషోర్‌ తెలిపారు. వార్డు, గ్రామ వలంటీర్లు, సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్ల ద్వారా రేషన్‌ సరుకులు ఇచ్చే తేదీ, సమయం తెలియజేస్తామన్నారు.

Advertisement
Advertisement
Advertisement