గుడిహత్నూర్, జనవరి 23 : మండలంలోని ఆయా గ్రామాల్లో ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు మేకలకు, గొర్రెలకు పీపీఆర్ టీకాలు వేస్తున్నట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్ రాథోడ్ జీవన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 24న ముత్నూర్, తోషం, 26న జవహార్‌నగర్, శాంతాపూర్, 27న కోల్హారి, తోషం తండా, ఉమ్రి, 28న మన్నూర్, శంభుగూడ, సూర్యగూడ, 29న చిన్నమన్నూర్, సాయినగర్, గురుజ, 30న సీతాగోంది, న్యూ బెల్లూరి, 31న కమలపూర్, తేజాపూర్, ఫిబ్రవరి 1మల్కాపూర్, సోయంగూడ, 2న వైజాపూర్, తెలంగ్‌రావుగూడ, 3న ముత్నూర్‌తాండ, కొలాంగూడ, ఓల్డ్ బెల్లూరి, 4న మన్కాపూర్, మనుకుగూడ, గర్కంపేట్, 5న జిడిపల్లి,పాండుగూడ, చింతగూడ, దరమడు, 6న ఓల్డ్ సోమర్‌పేట్, న్యూ సోమార్‌పేట్, 7న పునగూడ, రాఘాపూర్, బొర్రమద్ది గ్రామాల్లోని మేకలు, గొర్రెలకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.