Abn logo
Sep 17 2021 @ 01:00AM

పాఠశాలకు రూ.8 లక్షల విలువైన సామగ్రి వితరణ

దాతలను సన్మానిస్తున్న గ్రామస్థులు

డీ హీరేహాళ్‌, సెప్టెంబరు 16: మండలంలోని గొడిశెలపల్లి జిల్లాపరిషత ఉన్నత పాఠశాలకు జయరామిరెడ్డి, నీలాంబరి  జ్ఞాపకార్థం భారత వాతావరణ శాఖ రిటైర్డ్‌ డైరెక్టర్‌ జనరల్‌  డాక్టర్‌ కేజే రమేష్‌, సుధారమే్‌షలు రూ.8లక్షలు విలువ చేసే పాఠశాల సామగ్రిని గురువారం వితరణ చేశారు. పాఠశాలలో డిజిటల్‌ తరగతుల నిర్వహణ కోసం పది కంప్యూటర్లు, రెండు ఏసీలు, ఎల్‌ఈడీ టీవీలు తదితర సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల నూతన కంప్యూటర్‌ ల్యాబ్‌ను దాతల చే తుల మీదుగా ప్రారంభించారు. ల్యాబ్‌కు జయనీల కంప్యూటర్‌ ల్యాబ్‌గా నామకరణం చేశారు.  డిజిటల్‌ తరగతుల బోధన కో సం ప్రత్యేకంగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించారు. ఇత నికి జీతాన్ని అందించడానికి గ్రామ వైసీపీ నాయకుడు రాళ్ల తి మ్మారెడ్డి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులంతా క లసి దాతలు రమేష్‌, సుధారమేష్‌లను ఘనంగా సన్మానించి  కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఈవో తిమ్మప్ప, సర్పంచ రాళ్ల రామలక్ష్మీ, వైసీపీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవీంద్రనాథ్‌ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కృష్ణవేణి, సింగిల్‌ విం డో ప్రెసిడెంట్‌ వెంకటరెడ్డి, శ్రీనివాసులు, నారాయణ, జగదీష్‌, రామాంజనేయులు పాల్గొన్నారు.