వృషభాచలేశ్వరస్వామి ఆలయ చైర్మన్, సభ్యులకు వెండిని అందిస్తున్న దాతలు
వేంపల్లె, జూన్ 29: పాపాఘ్ని నది ఒడ్డున వెలసిన లక్ష్మీ వృషభాచలేశ్వరస్వామికి 1.50 కిలోల వెండిని దాతలు వితరణ చేశారు. సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లె వాసు లు సవరాల శ్రీనివాసులు, మల్లమ్మ దంపతులు బుధ వారం ఆలయ చైర్మన్ కురా కుల వెంకటేశ్, ప్రధాన అర్చ కుడు హరిప్రవీణ్‌కు అందజేశారు. స్వామివారికి కాసులమాల చేసేందుకు ఈవెండిని అం దించినట్లు దాతలు తెలిపారు. దాతలను ఆలయ చైర్మన్, సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పుల్లగూర అరవింద్, గడ్డం బాలాజీ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.