గౌతవరానికి విశిష్ట అతిథులు

ABN , First Publish Date - 2022-05-20T05:12:47+05:30 IST

మండలంలోని గౌతవరంలో విశిష్ట అతిథులు వచ్చాయి. సైబీరియా దేశానికి చెందిన పక్షులు వచ్చి ఇక్కడి చెట్లపై సేదతీరుతున్నాయి. ఏటా వేసవి కాలంలో గ్రామానికి సైబీరియా నుంచి ఈ అతిథులు వస్తుంటాయి. మే మొదటి వారంలో ఈ పక్షుల రాక ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కూడా 100 నుంచి 150 పక్షులు ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చాయి. గ్రామం బయట, ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలపై నివాసం ఏర్పర్చుకున్నాయి.

గౌతవరానికి విశిష్ట అతిథులు
గౌతవరంలో చెట్ల మీద ఉన్న సైబీరియా పక్షులు

సైబీరియా పక్షులతో గౌతవరం  కళకళ

రాచర్ల, మే 19 : మండలంలోని గౌతవరంలో విశిష్ట అతిథులు వచ్చాయి. సైబీరియా దేశానికి చెందిన పక్షులు వచ్చి ఇక్కడి చెట్లపై సేదతీరుతున్నాయి. ఏటా వేసవి కాలంలో గ్రామానికి సైబీరియా నుంచి ఈ అతిథులు వస్తుంటాయి. మే మొదటి వారంలో ఈ పక్షుల రాక ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కూడా 100 నుంచి 150 పక్షులు ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చాయి. గ్రామం బయట, ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలపై నివాసం ఏర్పర్చుకున్నాయి. పగలంతా చెరువుల వద్దకు వెళ్లి చేపలను ఆహారంగా తీసుకుని నెలపాటు ఇక్కడ సేదతీరడం ఆనవాయితీ. జూన్‌ ప్రారంభంలో వర్షాలు మొదలవుతున్న సమయంలో గౌతవరం  నుంచి తిరిగి సైబీరియాకు తరలిపోతాయి. ఏటా వచ్చే ఈ అతిథుల కోసం గ్రామస్థులు ఇతర ప్రాంతవాసులు వాటికి అవసరమైన ధాన్యాలు, చేపలను ఆహారం వేస్తూ స్వాగతం పలుకుతారు.  



Updated Date - 2022-05-20T05:12:47+05:30 IST