Abn logo
Jul 3 2020 @ 04:44AM

ఎనిమిది మంది సీఐలకు స్థానచలనం

కాకినాడ క్రైం, జూలై 2 : జిల్లాలో ఎనిమిది మంది సీఐలను బదిలీ చేస్తూ ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన్‌రావు ఉత్తర్వులు ఇచ్చారు. కాకినాడ త్రీ టౌన్‌ క్రైం సీఐ ఎన్‌ రజనీకుమార్‌ను జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ)కు బదిలీ చేశారు. అక్కడ సీఐగా ఉన్న ఎస్‌ రాంబాబును పోలీస్‌ కంట్రోల్‌ రూం (పీసీ ఆర్‌)కు బదిలీ చేశారు. పీసీఆర్‌ సీఐగా ఉన్న వి సురేష్‌బాబును జగ్గంపేట సర్కిల్‌కు బదిలీ చేశారు.


సీఐగా పనిచేస్తున్న వై రాంబాబును ఏలూరు రేంజ్‌ పరిధిలో వీఆర్‌లో ఉంచారు. అమలాపురం టౌన్‌ సీఐగా పనిచేస్తున్న జి సురేష్‌బాబును రూరల్‌ సీఐగా బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఆర్‌ భీమరాజును వీఆర్‌లో ఉంచారు. ప్రత్తిపాడు సీఐ ఏఎస్‌ రావుతోపాటు, రంప చోడవరం సీఐ బీహెచ్‌ వెంకటేశ్వర్లును వీఆర్‌లో ఉంచారు. 

Advertisement
Advertisement
Advertisement