హైదరాబాద్ : నిందితులు కాల్పులు జరిపినప్పుడు చనిపోతానని భయపడ్డానని, దేవుడి దయవల్లే చావు నుంచి బయటపడినట్లు హెడ్‌కానిస్టేబుల్ జానకీరాం తెలిపారు. ఘటనా స్థలంలో తాను భయంతో ఉన్నానని, అందుకే వాంగ్మూలం నమోదు సమయంలో సరిగా వివరాలు చెప్పలేదన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు విచారణలో భాగంగా నిందితులు మహ్మద్ అరిఫ్, జొల్లు నవీన్ హ్యాండ్లర్లైన హెడ్‌కానిస్టేబుల్ జానకీరాం, కానిస్టేబుల్ బాలు రాథోడ్‌ల వాంగ్మూలాలను విచారణ కమిషన్ గురువారం నమోదు చేసింది. నిందితులకు సంకేళ్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించగా.. ఉన్నతాధికారులు తమకు చెప్పలేదని వారు సమాధానం ఇచ్చారు. శుక్రవారం కూడా దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు విచారణ కొనసాగనుంది. నిందితుడు చెన్నకేశవులు హ్యాండ్లర్ కానిస్టేబుల్ శ్రీకాంత్‌ను కమిషన్ ప్రశ్నించనుంది.