Abn logo
Jul 31 2021 @ 00:23AM

మూన్నెళ్ల ముచ్చటే!

ప్రైవేటు టీచర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు నిలిచిన ఆపత్కాల సాయం

మూడు నెలలు అందజేసి నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం

బడులు తెరిచేవరకు కొనసాగించాలని సిబ్బంది వేడుకోలు

బోధన్‌, జూలై 30: కరోనా కష్టకాలం నుంచి ప్రైవేటు పాఠశాలల టీచర్లను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. టీచర్లతో పాటు నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు ప్రతినెలా రూ.2వేలతో పాటు 25 కిలోల బియ్యం ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన మున్నాళ్ల ముచ్చటగానే మారింది. ఏప్రిల్‌, మే, జూన్‌ మూడు మాసాలు మాత్రమే ప్రైవేటు టీచర్లకు నగదు సాయం అందింది. మూడు నెలల పా టు ప్రతినె లా రూ.2వేల ఆర్థిక సాయంతో పాటు 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. పాఠశా లలు తిరిగి ప్రారం భమయ్యేంత వర కు ప్రైవేటు టీచ ర్లను ఆదు కుంటా మని, ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రక టించినా బడులు తెరుచుకోకముందే సాయం నిలిచిపో యింది. ప్రభుత్వం కరోనా ఉధృతి దృష్ట్యా బడులు తెర వొద్దని ఆన్‌లైన్‌ తరగతులు మాత్రమే నిర్వహించుకో వాలని ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఎక్కడా బడులు తెరు చుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు టీచర్లకు ఉపాధి అవకాశం లేకుండానే ప్రైవేటు సాయం నిలిచిపోవడం టీ చర్ల కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. జూలై మాసానికి సంబంధించి ఇప్పటి వరకు నగదు 2వేలు ప్రైవేటు టీచర్ల ఖాతాల్లోకి చేరలేదు. రేషన్‌ బియ్యం కోటా కూడా రేషన్‌ షాపులకు చేరలేదు. ప్రైవేటు టీచర ్లకు ఇచ్చే ఆపత్కాల సాయం బడులు తెరుచుకోకుండానే మూడు నెలలకే నిలిచిపోవడం పట్ల విమర్శలు వ్య క్తమవుతున్నాయి. బడులు ప్రారంభం అయ్యేంత వరకు ఆపత్కాల సాయం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అర్థాంతరంగా నిలిపివేయడం ఏమిటని ప్రైవేటు టీచర్లు ప్రశ్నిస్తున్నారు. 

జిల్లాలో 10 వేల మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ 

జిల్లాలో వందలాది ప్రైవేటు పాఠశాలలున్నాయి. ని జామాబాద్‌ నగరంతో పాటు బోధన్‌, ఆర్మూర్‌ పట్టణా లు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో వందల స ంఖ్యలో పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలలో పనిచేస్తు న్న టీచింగ్‌, నాన్‌ టీచి ంగ్‌ స్టాఫ్‌ సుమారు 10వేల మందిపైనే ఆపత్కాల సాయానికి అర్హత పొం దారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వీరందరికీ ప్ర భుత్వం నుంచి మూడు నెలల పాటు ఆర్థిక సాయం అందింది. మూడు నెలలపాటు నగదు, బియ్యం తీసుకు న్న టీచర్లు తిరిగి పాఠశాలలు ప్రారంభం అయ్యేంత వరకు ఈ సాయం అందుతుందని ఊహించారు. కానీ, పరిస్థితులు మారిపోయాయి. పాఠశాలలు తెరుచుకోకుం డానే ప్రభుత్వ నగదు సాయం నిలిచిపోయింది. జూలై మాసానికి సంబంధించి నెల ముగిసిపో వడంతో ఆపత్కాల సాయం లేనట్లేనని లెక్క తేలిపోయింది. ఇప్పటికీ రేషన్‌ షాపులకు బియ్యం చేరుకోకపోవడంతో రేషన్‌ డీలర్లు సైతం ప్రైవేటు టీచర్ల బియ్యం లేనట్టేనని తేల్చేస్తున్నారు. కిందిస్థాయిలో విద్యాశాఖ అధికారులు సైతం ప్రైవేటు టీచర్ల, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నగదు సా యం లేనట్లేనని చెప్పుకొస్తున్నారు. 

బడులు తెరవకుండానే సాయం నిలిపివేత

రాష్ట్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో పాఠశాలలను ఇ ంకా పునఃప్రారంభించలేదు. ఆన్‌లైన్‌ క్లాసులతోనే సరి పెట్టుకోవాలని, పాఠశాలలో ప్రత్యేక తరగతులు లేవని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. బడులు తెరిచే పరిస్థితులు లేకపోవడంతో ప్రైవేటు టీచర్లకు ఉపాధి మార్గాలు లేకు ండా పోయాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఆన్‌లైన్‌ క్లాసులు మొక్కుబడిగా మారడం.. ప్రైవేటు టీచర్లకు ఉపాధి మార్గాలు లేకపోవడం బడ్జెట్‌ పాఠశాలల యాజ మాన్యాలు సైతం ప్రస్తుత పరిస్థితులలో తీవ్రమైన దు స్థితిని ఎదుర్కొంటున్నాయి. దాదాపు రెండే ళ్లుగా ఉపాధి లేక ప్రైవేటు పాఠశాలల టీచర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ దుర్బరమైన పరిస్థితులను ఎదుర్కొంటుండగా ప్రభుత్వ నగదు సాయం, బియ్యం అందజేత ఎంతో కొంత ఉపశ మనం  కలిగించిందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్ర భుత్వ పెద్దలు పునరాలోచించాలని, బడు లు పూర్తిస్థా యిలో తెరుచుకునేంత వరకు ప్రైవేటు పాఠశాలల టీచర్లు, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ ఆపత్కాల సాయం అందజేయాలని కోరుతున్నారు.