ఎచ్చెర్ల వైసీపీలో రచ్చరచ్చ

ABN , First Publish Date - 2022-08-18T04:24:18+05:30 IST

ఎచ్చెర్ల వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మండల సర్వసభ్య సమావేశంలో వెలుగుచూశాయి. బుధవారం జరిగిన సమావేశం ఆద్యంతం రచ్చరచ్చగా సాగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఎంపీపీ మొదలవలస చిరంజీవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 15వ ఆర్ధిక సంఘం నిధులకు సంబంధించి సభ్యులకు తెలియకుండానే పనులు మంజూరు చేయడంపై జడ్పీటీసీ సభ్యురాలు బల్లాడ హేమమాలిని, ఎంపీటీసీ సభ్యులు బల్లాడ జనార్దనరెడ్డి, జరుగుళ్ల విజయకుమారి, మాడుగుల జగదీశ్వరరావు, మాడుగుల స్వాతి తదితరులు ఎంపీపీని ప్రశ్నించారు. దానిపై

ఎచ్చెర్ల వైసీపీలో రచ్చరచ్చ
ఎంపీపీని ప్రశ్నిస్తున్న సభ్యులు


మండల సమావేశంలో వెలుగుచూసిన విభేదాలు

ఎచ్చెర్ల, ఆగస్టు 17: ఎచ్చెర్ల వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి.  మండల సర్వసభ్య సమావేశంలో వెలుగుచూశాయి. బుధవారం జరిగిన సమావేశం ఆద్యంతం రచ్చరచ్చగా సాగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఎంపీపీ మొదలవలస చిరంజీవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 15వ ఆర్ధిక సంఘం నిధులకు సంబంధించి సభ్యులకు తెలియకుండానే పనులు మంజూరు చేయడంపై జడ్పీటీసీ సభ్యురాలు బల్లాడ హేమమాలిని, ఎంపీటీసీ సభ్యులు బల్లాడ జనార్దనరెడ్డి, జరుగుళ్ల విజయకుమారి, మాడుగుల జగదీశ్వరరావు, మాడుగుల స్వాతి తదితరులు ఎంపీపీని ప్రశ్నించారు. దానిపై చర్చించాలని పట్టుబట్టారు. నిబంధనల మేరకు అజెండాలో పొందుపర్చిన అంశాలను క్రమ పద్ధతిలోనే చర్చిస్తామని ఎంపీపీ చిరంజీవి చెప్పినప్పటికీ వారు వినలేదు. ఒక దశలో ఎస్‌ఐ సత్యనారాయణ, పోలీసు సిబ్బంది కలుగజేసుకోవాల్సి వచ్చింది. ఎవరికీ తెలియకుండా పనులు మంజూరు చేయడమేమిటని సభ్యులు ఎంపీపీకి ప్రశ్నల వర్షం కురిపించారు. అత్యవసర పరిస్ధితుల్లోనే ముందుగా పనులు చేపట్టి తర్వాత సమావేశంలో సభ్యుల రేటిఫికేషన్‌ కోరుతారని, అలా కాకుండా 15 ఆర్ధిక సంఘం నిధులతో చేపట్టిన ఈ పనులు అత్యవసరమా ? అని నిలదీశారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పట్టుబట్టారు. ఽభగీరథపురం, ముద్దాడ గ్రామాల్లో వివిధ పనులను 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.18 లక్షల పనులు మంజూరుచేశారు. అజెండాలో ఈ విషయాన్ని రేటిఫికేషన్‌ కోసం పొందురిచారు. మండల పరిషత్‌లో బడ్జెట్‌ ఎంత ఉంది? గత సమావేశం తర్వాత ఖర్చుల వివరాలు కావాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. చివరకు 15వ ఆర్ధిక సంఘం నిధులతో చేపట్టిన మంజూరు చేసిన పనులపై ఓటింగ్‌ నిర్వహించారు. హాజరైన 22 మందిలో మెజార్టీ సభ్యులు తీర్మానానికి వ్యతిరేకించారు. సమావేశంలో తహసీల్దార్‌ టి.సత్యనారాయణ, ఎంఈవో కారు పున్నయ్య, ఏవో సురేష్‌, హౌసింగ్‌ ఏఈ యు.రాజేంద్రప్రసాద్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు సనపల నారాయణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా ఉదయం 10.30 గంటల సమయంలో సమావేశానికి ప్రారంభంకావాల్సి ఉంది. అయితే మెజార్టీ సభ్యులు ముందుగా ఓ చోట సమావేశమయ్యారు. సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.ఉదయం 11.15 గంటలకు సమావేశ మందిరానికి చేరుకున్నారు. 



Updated Date - 2022-08-18T04:24:18+05:30 IST