వైసీపీలో విభేదాల రచ్చ

ABN , First Publish Date - 2022-07-19T05:22:32+05:30 IST

వైసీపీలో నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ప్రెస్‌మీట్లు పెట్టి పరస్పర ఆరోప ణలు చేసుకుంటున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. నరసన్నపేట, జలుమూరు మండలాల్లో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ కోటరీ లారీ ఇసుక రూ.వెయ్యి నుంచి రూ.4,800కు అమ్ముకుంటున్నారంటూ స్థానిక వైసీపీ నాయకులు తీవ్ర మైన ఆరోపణలు చేశారు. ఆముదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఉండగా.. మరో నాయకుడి ప్రతిపాదనలు అవసరంలేదంటూ స్థానిక వైసీపీ నాయకులు భగ్గుమన్నారు. సోమవారం ఈ రెండు చోట్లా అధికారపార్టీ నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి రచ్చరచ్చ చేశారు.

వైసీపీలో విభేదాల రచ్చ

ఆ రెండు చోట్లా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ పరస్పర విమర్శలు
ఇసుక అమ్ముకుంటున్నారని సొంతపార్టీ వారిపైనే ఆరోపణలు
ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ కోటరీగా చెప్పుకుంటున్నారని ధ్వజం
మరో నియోజకవర్గంలో చిచ్చుపెట్టిన ‘కళాశాల మార్పు’ వ్యవహారం
స్పీకర్‌ ఉండగా మరో నాయకుడి ప్రతిపాదనలు వద్దని అభ్యంతరం

(నరసన్నపేట/ఆమదాలవలస, జూలై 18)

వైసీపీలో నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ప్రెస్‌మీట్లు పెట్టి పరస్పర ఆరోప ణలు చేసుకుంటున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. నరసన్నపేట, జలుమూరు మండలాల్లో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ కోటరీ లారీ ఇసుక రూ.వెయ్యి నుంచి రూ.4,800కు అమ్ముకుంటున్నారంటూ స్థానిక వైసీపీ నాయకులు తీవ్ర మైన ఆరోపణలు చేశారు. ఆముదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఉండగా.. మరో నాయకుడి ప్రతిపాదనలు అవసరంలేదంటూ స్థానిక వైసీపీ నాయకులు భగ్గుమన్నారు. సోమవారం ఈ రెండు చోట్లా అధికారపార్టీ నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి రచ్చరచ్చ చేశారు.

ఇసుకను అమ్ముకుంటున్నారు
నరసన్నపేట, జలుమూరు మండలాల్లో ఇసుక ర్యాంపుల్లో కొందరు వైసీపీ నాయకులు అక్రమవసూళ్లకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు డా.ముద్దాడ బాలభూపాల నాయు డు, బి.రాజశేఖర్‌, పోగోటి భరత్‌ ఆరోపించారు. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ కోటరీగా చెప్పు కుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఇసుక ర్యాంపుల్లో లారీకి రూ.వెయ్యి నుంచి రూ.4,800 వరకు వసూలు చేస్తు న్నారన్నారు. వీరి అక్రమాలపై పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలకు, తెలియజేయాలన్న ఉద్దేశంతో దాసన్న వాట్సాప్‌ గ్రూప్‌లో వీడియోలు పెడితే ఆ వ్యక్తిని గ్రూపు నుంచి తొలగించడం సరికాదన్నారు. ప్రభుత్వ అను మతి ఇచ్చిన ర్యాంపుల్లో కోటరీలోని కొందరు సభ్యులు ఇసుకను అక్ర మంగా తవ్వుకుని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యవ హారాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు నాయకులు పార్టీ కార్యాల యంలో ఉండి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, ఇది తగదని హితవు పలికారు. ఎమ్మెల్యేకి చెడ్డపేరు తీసువస్తే సహించేది లేదన్నారు.

 మీ ప్రతిపాదనలు అవసరం లేదు
ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీలో వర్గాల పోరు మరోసారి బయటపడింది. తమ ప్రతిపాదనతోనే ముఖ్యమంత్రి కళాశాలల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని పొందూరుకు చెందిన వైసీపీ నాయకుడు చెప్పుకుంటుండగా.. స్పీకర్‌ను కాదని మీరిలా చేయ డం తగదని మరికొందరు హితవు పలుతుకున్నారు. ఆమదాలవలస, పొందూరు జూనియర్‌ కళాశాలను ప్రభుత్వం బాలికల కళాశాలలగా మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెల్సిందే. దీన్ని విపక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. పొందూరు కళాశాల మార్పు తన వల్లే ఆగిందని వైసీపీ నాయకుడు సువ్వారి గాంధీ నాలుగు రోజుల క్రితం పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆమదాలవలసలోని స్పీకర్‌ క్యాంపు కార్యాలయం వద్ద మున్సిపల్‌ మాజీ ప్లోర్‌ లీడర్‌ బొడ్డేపల్లి రమేష్‌ కుమార్‌ తదితరులు విలేకరుల పెట్టి దీన్ని తీవ్రంగా ఖండించారు. కొంతమంది వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పార్టీ ప్లీనరీలో తమ్మినేని సీతారాం కళాశాల మార్పు విషయం ముఖ్యమంత్రి దృష్టికి తేవటంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. స్పీకర్‌ తమ్మినేని ఉండగా ఇంకొకరి ప్రతిపాదనలు అవసరం ఎందుకని ప్రశ్నించారు. సమావేశంలో వైసీపీ నాయకులు పి.చిన్నారావు, డి.శ్యామలరావు, ఎ.ఉమామహేశ్వరరావు డి.చిరంజీవి పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-19T05:22:32+05:30 IST