దిండుగల్‌లో శ్రీలంక తమిళులకు గృహాలు

ABN , First Publish Date - 2021-07-01T13:55:49+05:30 IST

రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దిండుగల్‌ జిల్లాలో శరణార్థ్ధుల శిబిరంలో నివసిస్తున్న శ్రీలంక తమిళులకు రూ.20 కోట్లతో 1,000 గృహాలు నిర్మించనున్నట్లు మైనార్టీ సంక్షేమ శా

దిండుగల్‌లో శ్రీలంక తమిళులకు గృహాలు

           - మంత్రి సెంజి మస్తాన్‌


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దిండుగల్‌ జిల్లాలో శరణార్థ్ధుల శిబిరంలో నివసిస్తున్న శ్రీలంక తమిళులకు రూ.20 కోట్లతో 1,000 గృహాలు నిర్మించనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ, తమిళ ఎన్నారైల సంక్షేమ శాఖ మంత్రి సెంజి మస్తాన్‌ తెలిపారు. దిండుగల్‌ జిల్లాలోని శరణార్ధుల శిబిరంలో నివసిస్తున్న లంక తమిళులకు మంత్రులు ఐ.పెరియస్వామి, సెంజి మస్తాన్‌లు బుధవారం కరోనా నివారణ సహాయాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పెరియస్వామి మాట్లాడుతూ, శ్రీలంక శరణార్ధులందరికీ భారత పౌరసత్వం అందించాలని ప్రధానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారని తెలిపారు. మంత్రి మస్తాన్‌ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ఎకరాల వక్ఫ్‌ బోర్డు స్థలాలు ఆక్రమ ణకు గురయ్యారని, వాటి వివరాలు వెబ్‌సైట్‌లో వెల్లడించామని, ఆ స్థలాలు త్వరలో స్వాధీనం చేసుకుంటామని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-07-01T13:55:49+05:30 IST