రష్యా నుంచి బెదిరింపులు.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన దిగ్విజయ్

ABN , First Publish Date - 2020-04-04T23:24:48+05:30 IST

గత నాలుగు, ఐదు రోజుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తుండటంతో.. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ఆయన ఫోన్‌ని స్విచ్ఛాఫ్ చేసుకున్నారు.

రష్యా నుంచి బెదిరింపులు.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన దిగ్విజయ్

భోపాల్: గత నాలుగు, ఐదు రోజుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తుండటంతో.. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ఆయన ఫోన్‌ని స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినా ఈ బెదిరింపులు తగ్గడం లేదని ఆయన పేర్కొన్నారు. 14, 15 నెంబర్ల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని.. అందులో ఎక్కువశాతం నెంబర్లు రష్యాకు చెందినవే అని ఆయన తెలిపారు. 


శుక్రవారం ఉదయం ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘గత 4/5 రోజులుగా నన్ను ఇబ్బందిపెడుతున్న నెంబర్లు ఇవి. మధ్యప్రదేశ్ డీజీపీకి దీని గురించి ఫిర్యాదు కూడా చేశాను. సర్వీస్ ప్రొవైడర్‌తోనూ ఈ విషయం గురించి మాట్లాడాను.. కానీ కాల్స్ ఆడలేదు. ఈ పరిస్థితుల్లో నేను నా ఫోన్ స్విచ్ఛ్ ఆప్ చేయక తప్పడం లేదు’’ అంటూ దిగ్విజయ్ ట్వీట్ చేశారు. 


రష్యా యూనివర్సిటీలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను ఆదుకోవాలని కొద్దిరోజుల క్రితం దిగ్విజయ్ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్‌కు లేఖ రాశారు. అంతేకాక.. కరోనావైరస్ లాక్‌డౌన్‌కి సంబంధించిన సమాచారం కోసం తన ల్యాండ్‌లైన్ నెంబర్లకు కాల్ చేయమంటూ.. ఆయన మూడు నెంబర్లు కూడా ఇచ్చారు. 

Updated Date - 2020-04-04T23:24:48+05:30 IST