పరిపాలనతో సంబంధం లేకున్నా జోక్యం

ABN , First Publish Date - 2022-08-12T05:49:30+05:30 IST

సాంకేతిక విద్యావ్యవస్థలో అనంతపురం జేఎన టీయూ దేశంలోని వర్సిటీలకు దిక్సూ చిగా పేరు పొం దింది. ఎంతో మంది మేధావులను ప్రపంచానికి అందించిన ఘనత జేఎనటీయూది.

పరిపాలనతో సంబంధం లేకున్నా జోక్యం

సాంకేతిక వనంలో ‘వేరు’ పురుగులు

పరిపాలనతో సంబంధం లేకున్నా జోక్యం

జేఎనటీయూఏలో ఆ ఇద్దరి పెత్తనం

కోవర్టుల ద్వారా నిరంతర నిఘా

ఉద్యోగులకుస్వేచ్ఛ కరువు


సాంకేతిక విద్యావ్యవస్థలో అనంతపురం జేఎన టీయూ దేశంలోని వర్సిటీలకు దిక్సూ చిగా పేరు పొం దింది. ఎంతో మంది మేధావులను ప్రపంచానికి అందించిన ఘనత జేఎనటీయూది. ఇంతటి ఘనమైన వర్సిటీ ప్రతిష్టకు కొందరు మరకలు అంటిస్తున్నారు. బయట ఉన్న ఇద్దరు వ్యక్తులు వర్సిటీ వ్యవహారాలను శాసిస్తున్నారు. జేఎనటీయూలోని కొందరు ఆ ఇద్దరికి నిరంతరం సమాచారం ఇచ్చి, కోవర్టు వ్యవహారాలు నడిపిస్తున్నారని పూర్వ విద్యార్థులు, వర్శిటీ వర్గాలు మండిపడుతు న్నాయి. ఓ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి, మరో విశ్రాంత అధికారి కారణంగా జేఎనటీయూఏలో మెజార్టీ ఉద్యోగులు, అధికారులు మనశ్శాంతిగా విధులు నిర్వర్తించ లేకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పొరపాటున అసంతృప్తి వ్యక్తం చేసినా, ఆ ఇద్దరి గురించి ఏమరుపాటుగా ఏదైనా మాట్లాడినా వెంటనే రియాక్షన ఉంటోందని వాపోతున్నారు.

- అనంతపురం సెంట్రల్‌


ఎక్కడ ఏం జరిగినా..

జేఎనటీయూఏ కానస్టిట్యూషన పరిధిలో అనంతపురం ఇంజనీరింగ్‌ కళాశాల, ఓటీపీఆర్‌ఐ, కలికిరి, పులివెందుల ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో వందలాది అనుబంధ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో చీమ చిటుక్కుమన్నా ఆ ఇద్దరికి తెలుస్తుంది. వీసీ, రిజిస్ర్టార్‌, డైరెక్టర్స్‌, ప్రిన్సిపాల్స్‌.. ఇలా ఏ అధికారి ఏ పనులు చేశారో ప్రతి రోజూ రోజు సాయంత్రానికి ఆ ఇద్దరు అధికారులు తమ కోవర్టుల ద్వారా సమాచారం సేకరిస్తుంటారని పూర్వపు విద్యార్థులు, వర్శిటీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారం మూడేళ్ల నుంచి శృతిమించిందని అంటున్నారు. ఆ ఇద్దరి కోవర్టులు అర్హత, అనుభవం లేకున్నా ఏళ్ల తరబడి ఒకే చోట ఉంటూ, ఉద్యోగోన్నతులు, ఇంక్రిమెంట్లు పొంతున్నారని వర్శిటీ వర్గాలు మండిపడుతున్నాయి. ప్రైవేటు సంభాషణల్లో సైతం ఆ ఇద్దరు అధికారుల గురించి ఏదైనా మాట్లాదితే వెంటనే కక్షసాధింపు చర్యలు మొదలవుతాయని అంటున్నారు. ఏదో ఒక కారణంతో వారిపై బదిలీవేటు పడుతుందని ప్రచారం జరుగుతోంది. కలికిరి ఇంజనీరింగ్‌ కళాశాల సూపరింటెండెంట్‌ ఎండీ నాగభూషణం తనకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా బహిరంగ పరిచారని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. ఆ ఇద్దరి బాధితులు ఇంకా చాలామందే ఉన్నారని, వారి చర్యలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


స్వేచ్ఛకు సమాధి

సాంకేతిక వనం జేఎనటీయూలో స్వీపర్‌ నుంచి డైరెక్టర్‌ వరకు ఏ ఒక్కరూ స్వేచ్ఛగా విధులు నిర్వహించే పరిస్థితి లేదు. ఆ స్థానంలో కొనసాగాలన్నా, ఉద్యోగోన్నతి పొందాలన్నా, బదిలీ, ఇంక్రిమెంట్లు, ఆర్థిక ప్రయోజనాలు.. ఇలా ఏవైనా సరే ఆ ఇద్దరికి భజన చేస్తేనే సాధ్యమని వర్శిటీ వర్గాలు అంటున్నాయి. రిటైర్‌ అయిన అధికారి ఇంటికి ఉదయం, సాయంత్రం వెళ్లి.. భజనచేసి ప్రసన్నం చేసుకోవాలని, రాష్ట్రస్థాయి అధికారి ఆశీస్సులు పొందాలంటే కోవర్టుల ద్వారా భజనరాగాలను వినిపించుకోవాలని అంటున్నారు. లేదంటే ఎదగూబొదుగు ఉండదని ఉద్యోగవర్గాలు వాపోతున్నాయి. కళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న ఒకరిని పరిపాలనా విభాగంలోని ఒక సెక్షనకి అటెండర్‌గా మార్చారు. అకాల మరణం పొందిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశాన్ని కల్పించారు. బోధన విభాగంలోని కొందరు ఫ్యాకల్టీలను ఆర్థిక వనరులున్న విభాగాలకు మార్చారు. ఇలాంటివన్నీ ‘భజన’ వల్లే సాధ్యమవుతాయని ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరికి వ్యతిరేకంగా ఏ చిన్న వ్యవహారం జరిగినా.. బాధ్యుల చేతిలో పోస్టు ఊడినట్లు క్షణాల్లో ఉత్తర్వుల కాపీ ఉంటుందని అంటున్నారు. ఆ ఇద్దరికి నచ్చనివారు మరణించినా, మానవీయంగా వ్యవహరించరని, బాఽధిత కుటుంబాలకు హక్కుగా దక్కాల్సిన కారుణ్య నియామకాలు కూడా అందవని వర్శిటీ వర్గాలు అంటున్నాయి.


ప్రతి విభాగంలో కోవర్టులు

జేఎనటీయూ పరిపాలనా భవనంలో వీసీ, రెక్టార్‌, రిజిస్ర్టార్‌, డైరెక్టర్స్‌, ఫైనాన్స, జనరల్‌ సెక్షన, ఇంజనీరింగ్‌ సెక్షన ఇలా అనేక విభాగాలు ఉన్నాయి. ప్రతి విభాగంలో ఆ ఇద్దరికి కొందరు ఉద్యోగులు కోవర్టులుగా వ్యవహరిస్తారని వర్శిటీ వర్గాలు వాపోతున్నాయి. వారి కారణంగా తాము స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోలేకపోతున్నామని అంటున్నారు. కానస్టిట్యూషన పరిధిలోని కళాశాలల్లో ప్రిన్సిపాల్‌ చాంబర్‌ మొదలు.. కోర్సుల విభాగాలు, ల్యాబ్‌లు, హాస్టల్స్‌, గ్రంథాలయాలు.. ఇలా అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో ఆ ఇద్దరికి సమాచారం చేరిపోతుందని ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వర్సిటీతోపాటు కానస్టిట్యూషన పరిధి కళాశాలల పరిపాలనా వ్యవహారాలతో ఆ ఇద్దరికి సంబంధం లేదు. అయినా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారని, వర్సిటీ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని పలువురు ఉద్యోగులు మండిపడుతున్నారు. వర్సిటీ.. యూజీసీ, ఏఐసీటీఈ ఆధ్వర్యంలో నడుస్తోందా..? ఆ ఇద్దరి ప్రైవేట్‌ వర్సిటీనా? అని పూర్వ విద్యార్థులు, ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.


వారిదే ఆధిపత్యం...

ప్రొఫెసర్‌గా అర్హతలేని వ్యక్తులను వర్శిటీల వీసీలుగా నియమిస్తూన్నారంటే ఈ ప్రభుత్వ తీరును అర్థంచేసుకోవచ్చు. వర్శిటీల అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఒక్క రూపాయ ఇవ్వడం లేదు. తన సామాజికవర్గానికి పదవులు కట్టబెట్టి, ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఆదేశాలిచ్చే స్థాయిలో ఉన్న అధికారి, జేఎనటీయూ పాలనా వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు. వర్శిటీకి స్వేచ్ఛలేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్శిటీలపట్లా ఆయన ఇలాగే వ్యవహరిస్తున్నారు.

- వేమన, ఎఐఎ్‌సఏ రాష్ట్ర అధ్యక్షుడు


వర్సిటీని ముట్టడిస్తాం..

జేఎనటీయూ పరిపాలనా వ్యవహారాలతో సంబంధంలేని వైసీపీ సామాజికవర్గం ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఉన్నత పదవులు, ఉద్యోగోన్నతలు, బదిలీలు.. ఇలా అన్నింటా వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ, మెమోలు ఇస్తూ భయపెడుతున్నారు. దీనికి నిరసనగా శుక్రవారం జేఎనటీయూని ముట్టడిస్తాం.

- గుత్తా  ధనుంజయనాయుడు, టీఎనఎ్‌సఎ్‌ఫ జిల్లా అధ్యక్షుడు


కప్పులు కడగాల్సిందే..

బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులు వందలమంది జేఎనటీయూ పరిధిలో పనిచేస్తున్నారు. అర్హత, అనుభవం ఉన్నా, వారితో టీ కప్పులను కడిగిస్తున్నారు. వారిలో వారికే విబేధాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వం అని చెప్పుకుంటూ, వర్శిటీల్లో ముఖ్యమైన పోస్టులన్నీ అధికారపార్టీ సామాజిక వర్గంవారే అనుభవిస్తున్నారు. ఒకవేళ బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులను పోస్టుల్లో కూర్చోబెట్టినా, రోబోలాగా పనిచేయిస్తున్నారు.

- సాకేహరి, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు


కులరాజకీయాలు చేస్తున్నారు..

సమాజానికి మేఽధావులను పరిచయం చేస్తున్న వర్శిటీల్లో కులరాజకీయాలు చేస్తున్నారు. అధికార పార్టీ సామాజికవర్గం ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఉద్యోగులు, సిబ్బందిని భయబ్రాంతుకుల గురిచేస్తున్నారు. తన దారికిరాని వారిని బదిలీ, సస్పెండ్‌ చేస్తున్నారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ నిబంధనలకు అనుగుణంగా సాగాల్సిన వర్శిటీల పాలనను ఆధిపత్యకుల అధికారులు శాసిస్తున్నారు. విద్యా సంస్థల్లో ఇలాంటి దోరణి ప్రమాదకరం.

- సూర్యచంద్రయాదవ్‌, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి

Updated Date - 2022-08-12T05:49:30+05:30 IST