Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ డైట్‌తో కరోనాను అడ్డుకుందాం!

ఆంధ్రజ్యోతి(17-09-2020)

ఎలాంటి జలుబుకైనా బలవర్ధకమైన ఆహారం అవసరం. అలాగే కరోనా నియంత్రణకు కూడా రోగనిరోధక శక్తి పెంచుకోవడం ఎంతో ముఖ్యం. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు తోడ్పడే ఫుడ్స్‌ కొన్ని ఉన్నాయి. వీటితో కరోనా బారిన పడకుండా ఉండవచ్చు అంటున్నారు ఆహారనిపుణులు.  


నిత్యం బలవర్థకమైన బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి. అల్పాహారంలో నిమ్మజాతికి చెందిన కమలాపండు, నిమ్మ, ద్రాక్షపండ్లు తప్పనిసరిగా ఉండాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచడమే కాకుండా కేన్సర్‌ను సైతం అడ్డుకుంటాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి.  


బొప్పాయి చర్మానికి ఎంతో మంచిది. ఇందులోని ఫొటో న్యూట్రియంట్స్‌, యాంటీ ఆక్సిండెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.  

పచ్చి బొప్పాయి ముక్కలు తింటే బ్లడ్‌ షుగర్‌, కొలెస్ట్రాల్‌ నిలకడగా ఉంటుంది. బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  


గ్రీన్‌ టీ. పొద్దున్నే తాగితే ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. రోగనిరోధక శక్తిపెరుగుతుంది. ఇందులోని యాటీ ఆక్సిడెంట్స్‌ బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాలను నియంత్రణలో ఉంచుతాయి. గ్రీన్‌ టీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని విషపదార్థాల తొలగింపు ప్రక్రియకు ఇది తోడ్పడుతుంది.  


పెరుగులో ప్రొటీన్లు అధికం. అలాగే రోగనిరోధక శక్తి పెంపుదలలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. అంతేకాదు ఇందులో విటమిన్‌-డి పుష్కలంగా ఉంటుంది. ప్రొబయాటిక్‌ గుణాలున్న పెరుగు జలుబును నియంత్రించడంలో సహాయపడుతుంది. 


బాదం, పల్లీలు, ఖర్జూరాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, నేరేడు పండ్లలో జింక్‌, మెగ్నీషియం, ఒమేగా-3, ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. 


పసుపు, వేపాకులు, వెల్లుల్లి, పాలకూర, అల్లం, బ్రొకోలి, క్యారెట్‌, ఓట్‌మీల్‌, తేనె వంటివి ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధక శ క్తిని పెంచుకోవచ్చు.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...