నా మాట రాసి పెట్టుకోండి... సువేందు (Suvendu) సవాల్..!

ABN , First Publish Date - 2022-06-14T01:42:57+05:30 IST

గవర్నర్‌కు బదులుగా ముఖ్యమంత్రే యూనివర్శిటీ చాన్స్‌లర్‌గా ఉండేలా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఆమోదించిన..

నా మాట రాసి పెట్టుకోండి... సువేందు (Suvendu) సవాల్..!

కోల్‌కతా: గవర్నర్‌కు బదులుగా ముఖ్యమంత్రే యూనివర్శిటీ చాన్స్‌లర్‌(Chancellor)గా ఉండేలా పశ్చిమబెంగాల్ (West bengal) అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) సవాలు విసిరారు. ''దీదీ (మమతాబెనర్జీ) రిటైర్ కావాలే కానీ, చాన్స్‌లర్ కాలేరు. ఇది నా మాటగా రాసి పెట్టుకోండి'' అని అన్నారు. ముఖ్యమంత్రికే చాన్సిలర్ అధికారులు అప్పగిస్తూ రూపొందించిన బిల్లుకు మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో అనుకూలంగా 182, వ్యతిరేకంగా 40 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌కు పంపనున్నారు.


కాగా, తాజా పరిణామంపై  సువేందు అధికారి ఘాటుగా స్పందించారు. ''సొంత రాజకీయాల కోసం ఈ పని చేశారు. ముఖ్యమంత్రిని చాన్స్‌లర్ చేయాలనుకుంటున్నారు. అది జరిగే పని కాదు. ఆ ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదు. గవర్నర్ ఆమోదానికి బిల్లు పంపుతారు. దానిని ఆయన ఢిల్లీకి పంపుతారు. అది అక్కడే మాతో ఉండిపోతుంది. దీదీ రిటైర్ కావాలేమో కానీ, ఎప్పటికీ ఆమె చాన్స్‌లర్ కాలేరు. నా పేరు, నేను చెప్పిన మాట రాసి ఉంచుకోండి'' అని సువేందు సవాలు చేశారు.

Updated Date - 2022-06-14T01:42:57+05:30 IST