దేశం గర్వించేలా వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-11T06:23:26+05:30 IST

దేశం గర్వించేలా తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకుం టున్నామని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు.

దేశం గర్వించేలా వజ్రోత్సవాలు
పెద్ద బోనాలలో మొక్కకు నీళ్లు పోస్తున్న కొండూరు

సిరిసిల్ల రూరల్‌, ఆగస్టు 10: దేశం గర్వించేలా తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకుం టున్నామని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌  కొండూరు రవీందర్‌రావు అన్నారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని పెద్దబోనాలలో  స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఫ్రీడమ్‌ పార్కును అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి  ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రవీందర్‌రావు మాట్లాడుతూ ఫ్రీడమ్‌ పార్కుల ఏర్పాటు, దేశభక్తి సినిమాల ప్రదర్శన, ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలకు  గుర్తుగా ఫ్రీడమ్‌ పార్కును ఏర్పాటు చేశామని, 75 రకాలకు చెందిన 750 మొక్కలను నాటామని అన్నారు. 15 రోజులపాటు వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు.  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, కమిషనర్‌ సమ్మయ్య, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, వార్డు కౌన్సిలర్‌ కల్లూరి లత మధు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్లు   రాజు, అన్నారపు శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:23:26+05:30 IST