ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-04-13T06:24:13+05:30 IST

డయల్‌ యువర్‌ కమిషనర్‌లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించాలని మేయర్‌ రాయన భాగ్యలక్షి అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి

డయల్‌ యువర్‌ మేయర్‌లో భాగ్యలక్ష్మి

చిట్టినగర్‌, ఏప్రిల్‌ 12: డయల్‌ యువర్‌ కమిషనర్‌లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించాలని మేయర్‌ రాయన భాగ్యలక్షి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి డయల్‌ యువర్‌ మేయర్‌ నిర్వహించారు. పలుప్రాంతాల ప్రజలు ఫోన్‌లో తమ సమస్యలను మే యర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ కూడా పాల్గొన్నారు. గుణదల వీఎంసీ ఎంప్లాయీస్‌ కాలనీలో వాటర్‌సప్లయ్‌, డ్రెయిన్‌లు, వీధిలైట్లు అభివృద్ధి చే యాలని, బీసెంట్‌రోడ్డులో రాకపోకలకు ఇబ్బందులు, చిట్టినగర్‌ కొండప్రాంతంలో సమయపాలన లేకుండా వాటర్‌ సప్లయ్‌ చేయడంతో నీటి సమస్య పెరిగిందని, ఆటోనగర్‌ 7వ లైన్‌ ప్రాంతంలో చెత్తవ్యర్థాలతో ఇబ్బందులు, కుమ్మరిపాలెం రోడ్డు నుంచి సితార జంక్షన్‌ వరకు సెంట్రల్‌ డివైడర్‌ ఏర్పాటు చేయాలని వచ్చిన ఫిర్యాదులపై మేయర్‌ స్పందించి వెంటనే చర్య లు తీసుకోవాలని ఽఅధికారులకు సూచించారు.

బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, బకాయి జీతాలు చెల్లించాలని కోరు తూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎం ప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయు) నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికులు, యూనియన్‌ నేతలు ధర్నా చేశారు. నగర ప్రధాన కార్యదర్శి ఎం.డేవిడ్‌ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు బకాయిపడ్డ 7నెలల హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించాలన్నారు. 54 మంది బదిలీ కార్మికులకు 5నెలల జీతాలు, పార్కులు, ఇంజనీరింగ్‌ కార్మికులకు జీతాలు పెంచాలని, మాపిం గ్‌ కార్మికులకు, జక్కంపూడి కాలనీలో పని చే స్తున్న కార్మికులకు జీతాలు సక్రమంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినత పత్రాన్ని మేయర్‌ భాగ్యలక్ష్మికి అందజేశారు. యూనియన్‌ అధ్యక్షుడు ఎస్‌.జ్వోతి బాస్‌, నేతలు వి.సాంబులు, టీ.తిరుపతమ్మ, చక్క వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T06:24:13+05:30 IST