Advertisement
Advertisement
Abn logo
Advertisement

మధుమేహులూ జాగ్రత్త

ఆంధ్రజ్యోతి(13-07-2021)

మధుమేహులకు కొవిడ్‌ సోకడం మూలంగా తలెత్తే రుగ్మతలు భిన్నంగా ఉంటాయి. సత్వరం, సమర్ధమైన చికిత్స తీసుకోగలిగితే ఈ రుగ్తల నుంచి పూర్తిగా కోలుకునే వీలుంటుంది. 


డయాబెటిక్‌ కీటోఅసిడోసిస్‌: అదుపు తప్పిన మధుమేహం ఉన్నవారికి కొవిడ్‌ సోకడం మూలంగా డయాబెటిక్‌ కీటోఅసిడోసి్‌సకు గురవుతారు. వీరి రక్తంలో కీటోన్స్‌ అనే యాసిడ్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ పరిస్థితి ప్రాణాంతకం.


మ్యూకోర్‌మైకోసిస్‌: అదుపుతప్పిన మధుమేహానికి కొవిడ్‌ జతైతే, మ్యూకోర్‌మైకోసిస్‌ తప్పదు. అత్యఽధిక చక్కెర స్థాయిలు, కొవిడ్‌ చికిత్సలో భాగంగా వాడిన స్టిరాయిడ్లు, కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌... ఈ మూడూ తోడైనప్పుడు ఇమ్యూనిటీ స్థాయి తీవ్రంగా పడిపోయి, మ్యూకోర్‌మైకోసిస్‌ బారిన పడే అవకాశాలు పెరుగుతాయి.


న్యుమోనియా: కొవిడ్‌ 19 బారిన పడిన మధుమేహుల్లో చక్కెర స్థాయి నియంత్రణ తప్పితే, కొవిడ్‌ 19తో కూడిన న్యుమోనియా తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.


కాబట్టి మధుమేహులు కొవిడ్‌ కాలంలో మరింత అప్రమత్తంగా నడుచుకుంటూ మధుమేహాన్ని మందులతో, ఆరోగ్యకరమైన జీవనశైలితో అదుపులో ఉంచుకోవాలి.

Advertisement
Advertisement