శాస్త్రోక్తంగా ధ్వజారోహణ

ABN , First Publish Date - 2021-06-20T07:04:49+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన పాతసింగరాయకొండలోని శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఆంకుర్పాణ జరిగింది.ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన పాతసింగరాయకొండలోని శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఆంకుర్పాణ జరిగింది.

శాస్త్రోక్తంగా ధ్వజారోహణ
పూజా క్రతువు నిర్వహిస్తున్న వేదపండితులు

ంగరాయకొండ, జూన్‌ 19 : ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన పాతసింగరాయకొండలోని శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఆంకుర్పాణ జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం శనివారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఏకాంతంగా స్వామివారికి సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన ఆర్చకులు ఉదయగిరి వెంకట నరసింహచార్యులు, నందకిషోర్‌, సుదర్శనచార్యులు పాల్గొన్నారు. ఇక్కడి స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలకు విశిష్ట స్థానం ఉంది. ధ్వజారోహణ సమయంలో గరుడ పటాన్ని ఆవిష్కరించి స్వామి ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. అనంతరం భక్తులు తొమ్మిదిరోజులు స్వామివారి దీక్ష చేస్తారు. అనంతరం ధ్వజ అవరోహణ ప్రసాదం పంపిణీ చేస్తారు. నిష్టగా పూజా క్రతువు నిర్వహించి స్వామివారి  ప్రసాదాలను స్వీకరిస్తే సంతాన ప్రాప్తి జరుగుతుందని భక్తుల విశ్వాసం. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, స్వామి వారి దర్శనం ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకట నరసింహాచార్యులు తెలిపారు.

Updated Date - 2021-06-20T07:04:49+05:30 IST