పునరావాస కాలనీవాసులకు రేషన్‌ కష్టాలు

ABN , First Publish Date - 2021-02-27T06:06:24+05:30 IST

ధేనువకొండ పునరావాసకాలనీలో ఉండే వారు రేషన్‌బియ్యం కోసం ఇబ్బందు లు పడుతున్నారు. కాలనీలలో ఉండే వారి పేర్లు ఇ క్కడ ఉన్న రేషన్‌ షాపులో లేకపోవడంతో వారికి రేషన్‌ ఇవ్వని పరిస్థితి నెలకొంది.

పునరావాస కాలనీవాసులకు రేషన్‌ కష్టాలు
కాలనీలో రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్న వాహనం

పాత ధేనువకొండ వెళ్లి తెచ్చుకోవాలంటున్న వాహనదారులు


అద్దంకిటౌన్‌, ఫిబ్రవరి 26: ధేనువకొండ పునరావాసకాలనీలో ఉండే వారు రేషన్‌బియ్యం కోసం ఇబ్బందు లు పడుతున్నారు. కాలనీలలో ఉండే వారి పేర్లు ఇ క్కడ ఉన్న రేషన్‌ షాపులో లేకపోవడంతో వారికి రేషన్‌ ఇవ్వని పరిస్థితి నెలకొంది.  వాహనాల ద్వారా బి య్యం పంపిణీ చేసేవారు పాత ధేనువకొండ వెళ్లి తె చ్చుకోవాలని చెప్పడంతో కాలనీవాసులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. అద్దంకి మండలం ధేనువకొండ గ్రా మంలో మొత్తం 1300 వరకు రేషన్‌కార్డు దారులు ఉ న్నారు. గ్రామంలో 18, 45, 55 నెంబర్లతో మూడు రేషన్‌ షాపులు ఉన్నాయి. ధేనువకొండ గుండ్లకమ్మ ప్రా జెక్టు ముంపు గ్రామం కావడంతో బలరామకృష్ణపురం, వేలమూరిపాడు, మేదరమెట్ల ప్రాంతాల్లో పునరావాసకాలనీలను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా కాలనీలలో ప్లాట్లు ఇచ్చిన పలువురు ఇళ్లు నిర్మించుకుని అక్కడ నివాసం ఉంటున్నారు. దీంతో ఇక్కడ 55 నెంబర్‌ రేషన్‌ షాప్‌ను గతంలో ఏర్పాటు చేశారు. వేలమూరిపా డు, బలరామకృష్ణపురం పునరావాసకాలనీలకు సంబంధించిన వారిని ఈ రేషన్‌ షాపు పరిధిలోకి చేర్చి ఇ క్కడే రేషన్‌ అందిస్తున్నారు. ప్రసుత్తం ప్రభుత్వం ఇం టింటికి రేషన్‌ బియ్యం పేరుతో ఆటోలను ఏర్పాటు చేయడంతో పునరావాసకాలనీలకు 55వ నెంబరు రేషన్‌ షాపునకు సంబంధించిన మిషన్‌ తీసుకువచ్చి పం పిణీ చేస్తున్నారు. ఈ మిషన్‌లో ఆయా కాలనీలో ఉన్న సుమారు 20కుటుంబాలకు సంబంధించిన రేషన్‌ కార్డు నెంబర్లు నమోదు కాలేదు. దీంతో వారిని పాత ధేనువకొండ వెళ్లి తెచ్చుకోవాలని చెప్పడంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంపు గ్రామం అని పునరావాస కాలనీలకు పంపి ఇక్కడ మాత్రం అ ధికారులు వసతులు కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


డీలర్‌ లాగిన్‌ ఆపివేయడంతో సమస్య 


గతంలో డీలర్ల లాగిన్‌తో ఏ ప్రాంతంలో వారైన ఎ క్కడైన రేషన్‌ బియ్యం తీసుకునే వెసులుబాటు ఉం డేది. ప్రస్తుతం డీలర్ల లాగిన్‌ ఆపివేయడంతో  ఏ రేషన్‌షాపు పరిధిలోని రేషన్‌కార్డుదారులు అక్కడే రే షన్‌ తీసుకోవాలి. ఈక్రమంలో కాలనీలలో ఉన్న ప లువురి రేషన్‌కార్డులు పాత గ్రామంలోని రేషన్‌ షా పుల  పరిధిలో ఉన్నాయి. అందువల్ల  ఆయా షాపులకు సంబంధించిన మిషన్లు తెప్పించి అందరికీ రేషన్‌ ఇచ్చేలా చూస్తాం. 

- వాసంతి, వీఆర్‌వో, ధేనువకొండ

Updated Date - 2021-02-27T06:06:24+05:30 IST