Abn logo
Apr 16 2021 @ 00:47AM

‘ఉపాధి’ డబ్బులు చెల్లించాలని ధర్నా

పెద్దకోడప్‌గల్‌, ఏప్రిల్‌ 15: ఉపాధి హామీ డబ్బులు చెల్లించాలంటూ గురువా రం ఎంపీడీవో కార్యాలయం ఎదుట పెద్దకోడప్‌గల్‌ మండల పరిధిలోని జగన్నాథ పల్లి గ్రామనికి చెందిన ఉపాధి హామీ కూలీలు ఆందోళనకు దిగారు. జగన్నాథ పల్లిలో దాదాపు 60మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. వారం రోజులుగా హరితహారం కింద నాటిన మొక్కలకు నీరు పోయడం, కాల్వలలో పిచ్చి మొక్కలు తొలగించడం, చెరువులలో పూడికతీత పనులు చేపట్టారు. వీరికి వారం రోజులకు సంబంధించి ఉపాధి హామీ డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఎంపీవో సుర్యకాంత్‌ ఉపాధి కూలీ డబ్బులు ఇవ్వాలని బాధిత కూలీలు అడుగగా పాత వర్క్‌ ఐడీలో ఉండడం వల్ల డబ్బుల చెల్లింపులు జరగలేదని సమాదానం ఇచ్చా రు. కూలీలందరికి ఉపాధి డబ్బులు రూ.31వేల500 వచ్చేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో కూలీలు ఆందోళనను విరమించారు.

Advertisement
Advertisement