పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సంఘ నేతలు
సంతబొమ్మాళి: సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి నయవంచన చేశారని, దీనిని వ్యతిరేకిస్తూ.. ధర్మపోరాటం చేయను న్నామని ఏపీసీపీయస్‌ఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి సూరిబాబు అన్నారు. శుక్రవారం ధర్మపోరాటం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 24న అరసవల్లి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్య క్ష, కార్యదర్శులు పాపారావు, గణపతి, చంద్రుడు పాల్గొన్నారు.