Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాలీబాల్‌ టోర్నమెంట్‌ విజేత ధర్మారం

పెద్దపల్లి టౌన్‌, నవంబరు28: పెద్దపల్లి పోలీస్‌ శాఖ సబ్‌ డివిజన్‌ స్థాయి వాలీ బాల్‌ టోర్నమెంట్‌లో ధర్మారం జట్టు విజేతగా నిలిచింది. గత రెండు రోజుల పాటు స్థానిక జూనియర్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన టోర్నమెంటులో పెద్దపల్లి, సుల్తానాబాద్‌, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ధర్నారం, జూలపల్లి మండలాల జట్లు పాల్గొన్నట్లు ఏసీపీ సాదుల సారంగపాణి పేర్కొన్నారు. ఇందులో ధర్మారం జట్టు విజేతగా నిలువగా, జూలపల్లి జట్టు రన్నర్‌గా నిలిచింది. ఈ కార్యక్రమానికి హాజరైన అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ బహుమతులు ప్రదానం చేసిన అనంతరం మాట్లా డుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వానికి తోడ్పడుతాయన్నారు. ఉద్యోగులైనా, విద్యార్థులైనా, ఇతరులైనా క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక కోటా కేటాయించిందని వివరించారు. యువత చెడు వ్యసనాలకు గురికాకుండా క్రీడలపై దృష్టి సారిస్తే ఇతరత్రా ఆలోచ నలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం ప్రయత్నించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్‌, ఏసీపీ సాదుల సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement