ధర్మపురి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా

ABN , First Publish Date - 2021-10-19T05:53:34+05:30 IST

ధర్మపురి జూనియర్‌ సివిల్‌ జడ్జి, జ్యుడీషి యల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు జడ్జిగా డాక్టర్‌ ప్రమీల జైన్‌ సోమవారం భాధ్యతలు స్వీకరించారు.

ధర్మపురి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా
జడ్జి డాక్టర్‌ ప్రమీల జైన్‌కు నరసింహుని చిత్రపటం అందిస్తున్న జగిత్యాల బార్‌ అసోసియేషన్‌ సభ్యులు

డాక్టర్‌ ప్రమీల జైన్‌ భాధ్యతల స్వీకరణ 

ధర్మపురి, అక్టోబరు 18: ధర్మపురి జూనియర్‌ సివిల్‌ జడ్జి, జ్యుడీషి యల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు జడ్జిగా డాక్టర్‌ ప్రమీల జైన్‌ సోమవారం  భాధ్యతలు స్వీకరించారు. కోర్టు ఇన్‌చార్జి జడ్జిగా జగిత్యాల జిల్లా రెండవ అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ప్రతీక్‌ సుహాగ్‌ పని చేశారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా రామన్నపేట కోర్టు నుంచి ఆమె బదిలీపై ఇక్క డికి వచ్చారు. ఇన్‌చార్జి జడ్జి ప్రతీక్‌ సుహాగ్‌ నుంచి బాధ్యతలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో పరిచయ కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారు. జగిత్యాల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు తాండ్ర సురేందర్‌ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు జడ్జి ప్రమీల జైన్‌ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమెకు నరసిం హుని చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల బార్‌ అ సోసియేషన్‌ అధ్యక్షులు తాండ్ర సురేందర్‌, ప్రధాన కార్యదర్శి కటుకం చంద్రమోహన్‌, ఉపాధ్యక్షులు నాగిరెడ్డి మదుసూధన్‌రెడ్డి, సీనియర్‌ న్యా యవాదులు రాజన్న, సత్యనారాయణరెడ్డి, లక్ష్మణ్‌, సత్యనారాయణ, మల్లి ఖార్జున్‌, భూమయ్య, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T05:53:34+05:30 IST