సమావేశంలో మాట్లాడుతున్న గోదా శ్రీరాములు
భూదాన్‌పోచంపల్లి, జనవరి 20: స్వాతంత్య్ర సమరయో ధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పిలుపునిచ్చారు. భూదాన్‌పోచంపల్లిలో గురువారం జరిగిన పార్టీ మండల కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. సమాజమార్పు కోసం జరిగిన పోరాటాల్లో, సంస్కరణ ఉద్యమాల్లో ధర్మ భిక్షం కీలక పాత్ర పోషించారన్నారు. రవీంద్రభారతిలో వచ్చే నెల 15వ తేదీన ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యద ర్శివర్గ సభ్యుడు బోడ సుదర్శన్, బీమగాని నర్సింహగౌడ్, పబ్బు యాదయ్యగౌడ్, గో డల్ల నాగభూషణ్‌గౌడ్, చేరాల నర్సింహ, సంగెం గణేష్, కన్నెమోని శేఖర్ తదితరులు పాల్గొన్నారు.