22న ధరణి టౌన్‌షిప్‌ ప్లాట్లు, ఇళ్లకు వేలం

ABN , First Publish Date - 2022-08-10T05:30:00+05:30 IST

ధరణి టౌన్‌షిప్‌లో ఉన్న ప్లాట్లు, వివిధ దశలో ఉన్న నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు 22న వేలం పాట నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం ధరణిటౌన్‌ షిప్‌ ఓపెన్‌ ప్లాట్ల, ఇళ్లపై ఫ్రీబిడ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈసారి వేలంలో 20 ప్లాట్లు, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 175, పూర్తయిన ఇళ్లు 130 వేలం వేస్తామని తెలిపారు.

22న ధరణి టౌన్‌షిప్‌ ప్లాట్లు, ఇళ్లకు వేలం

కామారెడ్డి, ఆగస్టు 10: ధరణి టౌన్‌షిప్‌లో ఉన్న ప్లాట్లు, వివిధ దశలో ఉన్న నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు 22న వేలం పాట నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం ధరణిటౌన్‌ షిప్‌ ఓపెన్‌ ప్లాట్ల, ఇళ్లపై ఫ్రీబిడ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈసారి వేలంలో 20 ప్లాట్లు, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 175, పూర్తయిన ఇళ్లు 130 వేలం వేస్తామని తెలిపారు. ఆసక్తి గల లబ్ధిదారులు రూ.10వేలు చెల్లించి, వేలంలో పాల్గొన వచ్చని తెలిపారు. వేలంలో పాల్గొనే వ్యక్తి ఈఎండీ రూ.10వేలు కలెక్టర్‌ కామారెడ్డి పేరుపై డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వేలంలో పాల్గొనే వ్యక్తులు ఆధార్‌, పాన్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా వంటి గుర్తింపు పత్రాలను తీసుకురావాలని తెలిపారు. ఈ సమావేవంలో రాజీవ్‌ స్వగృహ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ సత్యనారాయణ, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ రాందాస్‌, ఏవో రవీందర్‌, తహసీల్ధార్‌ ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:30:00+05:30 IST