కామాక్షితాయి ఉచిత దర్శనం కోసం భక్తుడి నిరసన

ABN , First Publish Date - 2022-08-07T05:28:25+05:30 IST

మండలంలోని జొన్నవాడలో ఉన్న శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో ఉచిత దర్శనం కల్పించాలని ఓ భక్తుడు శనివారం క్యూ ముందు నిరసనకు దిగాడు.

కామాక్షితాయి ఉచిత దర్శనం కోసం భక్తుడి నిరసన
జొన్నవాడ ఆలయంలో భక్తుడి నిరసనతో క్యూలైన్లో ఏర్పాటు చేసిన ఉచితదర్శనం బోర్డు

 దిగివచ్చిన అధికారులు, పాలకవర్గం

ఉచిత దర్శనం బోర్డు ఏర్పాటు

బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 6: మండలంలోని జొన్నవాడలో ఉన్న శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో ఉచిత దర్శనం కల్పించాలని ఓ భక్తుడు శనివారం క్యూ ముందు నిరసనకు దిగాడు. ఉచిత దర్శనం బోర్డు ఏర్పాటు చేసేవరకు కదలనంటూ 40నిమిషాలపాటు బైఠాయించాడు. పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఫోన్లు చేశాడు. టికెట్‌ కౌంటర్లోకి వెళ్లి ఉచిత దర్శనం ఏర్పాటు చేయకపోవడంపై ప్రశ్నించాడు. ఆ సమాచారం అధికారులు, పాలకవర్గానికి తెలిసింది. వారి సూచనలమేరకు కార్యాలయ సిబ్బంది ఆఽగమేఘాలమీద ఉచిత దర్శనం బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ఆ భక్తుడు శాంతించి స్వామి, అమ్మవార్లను ఉచితంగా దర్శించుకున్నాడు.  పేద భక్తులందరికీ ఉచిత దర్శనం చేసుకునే అవకాశం కల్పించిన అతడు అందరి అభినందనలు అందుకున్నాడు. ఈ విషయంపై ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లును వివరణ కోరగా శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం ఉచిత దర్శనం తరువాత టిక్కెట్ల దర్శనం ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. 

Updated Date - 2022-08-07T05:28:25+05:30 IST