Advertisement
Advertisement
Abn logo
Advertisement

సత్యదేవుడి సన్నిధిలో భక్తుల పూజలు

దండేపల్లి, నవంబరు 28: మండలంలోని గూడెం గుట్టపై  ఆదివారం సత్యదేవుడి సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం చివరి ఆదివారం సెలవు దినం కావడంతో  సత్యదేవుడి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ముందుగా ఆలయ సమీపంలోని  గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు నదిలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం సత్యదేవున్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు కుటుంబ సమేతంగా స్వామివ్రతాలు చేసుకున్నారు. ఆలయంలోని రావి చెట్టు, ప్రధానలయ ఎదుట గల ధ్వంజస్తంభం వద్ద పలువురు మహిళలు ఉసిరికాయలతో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement
Advertisement