ఊరూరా అమ్మవారికి ఘనంగా పూజలు

ABN , First Publish Date - 2020-10-23T10:19:04+05:30 IST

దేవీశరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరోరోజైన గురువారం అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చింది

ఊరూరా అమ్మవారికి ఘనంగా పూజలు

కడ్తాల్‌/ఆమనగల్లు/చేవెళ్ల/కందుకూరు/యాచారం: దేవీశరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరోరోజైన గురువారం అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చింది. కడ్తాల మండలం మైసిగండి శివరామాలయాల్లో శ్రీమహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ రమావత్‌ సిరోలిపంతూ, ఈవో స్నేహలత ఆధ్వర్యంలో చండీహోమం, గణపతిహోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీ మోత్యానాయక్‌, సర్పంచ్‌ తులసీరామ్‌నాయక్‌, ఉపసర్పంచ్‌ రాజారామ్‌, తహాసీల్దార్‌ ఆర్‌పీ జ్యోతి, పాండునాయక్‌,  రమావత్‌ భాస్కర్‌, ఎర్రోళ్ల రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఆమనగల్లు కట్టమైసమ్మ ఆలయంలో అమ్మవారు లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జాతీయ బీసీ కమీషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మొక్తాల వెంకటయ్య, మాజీ జడ్పీటీసీ కండె హరిప్రసాద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌, వైస్‌ చైర్మన్‌ దుర్గయ్య, విజయ్‌కృష్ణ, చెన్నకేశవులు, లక్ష్మణ్‌, శ్రీకాంత్‌సింగ్‌, కృష్ణయాదవ్‌, విక్రమ్‌రెడ్డి, ఝాన్సీ శేఖర్‌, దివ్య, జ్యోతి, నర్సింహ, యాదమ్మాశ్రీశైలం యాదవ్‌, మేడిశెట్టి శ్రీధర్‌, యాదమ్మ, పాష పాల్గొన్నారు. ఆమనగల్లులోని శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయంలో  శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.


అదేవిధంగా సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో బికుమాండ్ల యాదయ్య, బికుమాండ్ల పాండయ్య, రాగిద్ది లక్ష్మీనారాయణ, అర్థం లక్ష్మయ్య, కండె పాండు రంగయ్య, కొరివి వెంకటయ్య, మంచుకొండ విష్ణువర్ధన్‌, వీరబొమ్మ రామ్మోహన్‌, కండె సుమన్‌, బికుమాండ్ల నర్సింహ, బొజ్జ నర్సింహ, పాపిశెట్టి రాము, మంచని రాజు, జూలూరి జయప్రకాశ్‌, కొట్రమల్లేశ్‌ పాల్గొన్నారు.  చేవెళ్ల మండల కేంద్రంలోని బ్రహ్మగిరి క్షేత్రం, కొనగట్టు క్షేత్రాలతో పాటు మండల పరిఽధిలోని మల్కాపూర్‌, తంగడ్‌పల్లి, ఆలూర్‌ గ్రామాల్లో దుర్గమాతకు ప్రత్యేక పూజలు చేశారు. చేవెళ్లలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పూజ, సేవ  కార్యక్రమాలు కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా దీపారాధన, స్వామివారి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మండలపాల వద్ద మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలు ఆడుతున్నారు.  కందుకూరు మండలం దాసర్లపల్లి, అగర్‌మియాగూడ, బాచుపల్లి కందుకూరు, కందుకూరు  గ్రామాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


దాసర్లపల్లిలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు కుర్నమోని జయేందర్‌ముదిరాజ్‌ నేతృత్వంలో సుమారు 20మంది యువకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అగర్‌మియాగూడలో గురువారం మాజీ ఉపసర్పంచ్‌ వడ్డెపల్లి రేవంత్‌రెడ్డి, ప్రసన్న ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పూజల్లో సంతో్‌షరెడ్డి, కిరణ్‌రెడ్డి, దిలీ్‌పరెడ్డి పాల్గొన్నారు. యాచారం మండలజ నందివనపర్తిలోని శ్రీజ్ఞానసరస్వతీ మాతా ఆలయం ఆవరణలో గురువారం ఉదయం 9గంటలనుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చండీహోమం నిర్వహించారు. వేదపండితులు సహస్రవేదపారాయణం చేశారు. వంద మంది చిన్నారులకు ఉచితంగా అక్షరాభ్యాసం చేశారు.

Updated Date - 2020-10-23T10:19:04+05:30 IST