శరణు మాతా..శరణు

ABN , First Publish Date - 2020-10-23T11:31:02+05:30 IST

నగరంలోని పలు డివిజన్లలో అమ్మ వారి ఆలయాల వద్ద దేవీ నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి.

శరణు మాతా..శరణు

ఏలూరు కార్పొరేషన్‌, అక్టోబరు 22 : నగరంలోని పలు డివిజన్లలో అమ్మ వారి ఆలయాల వద్ద దేవీ నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారికి అయా ఆలయాల్లో అంతరాలయంలో పంచామృతా భిషేకా లు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలు జరిపారు. భక్తులు భౌతిక దూరం, కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. అంబికాదేవి, సౌభాగ్య లక్ష్మీదేవి, కనకదుర్గాదేవి, బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవార్లు లలితా త్రిపుర సుందరీదేవిగా,  పన్నెండు పంపుల సెంటర్‌లోని కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా, బావి శెట్టివారిపేటలోని కనకదుర్గమ్మ అమ్మవారు మానసాదేవిగా, జ్ఞాన సరస్వతీదేవి ధనలక్ష్మిదేవిగా, రాజ్యలక్ష్మి అమ్మవారు గాయత్రీ తాయార్లుగా, కన్యకాపరమేశ్వరి గజలక్ష్మీదేవిగా, దక్షిణపువీధిలోని జలా పహరేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని మహిషా సుర మర్ధినిదేవి మహా సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో విద్యా ర్థులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, వైసీపీ ఆర్యవైశ్య సంఘ నాయకులు మోటమర్రి సదానందకుమార్‌ మిత్ర బృందం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థు లకు పెన్నులు, పుస్తకాలు, స్టేషనరీ కిట్‌లు అందజేశారు. 


Updated Date - 2020-10-23T11:31:02+05:30 IST