అభివృద్ధి నిరోధకులుగా పాలక వర్గం: మంచిరెడ్డి

ABN , First Publish Date - 2021-07-28T06:20:05+05:30 IST

తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పాలకవర్గం అభివృద్ధి నిరోధకులుగా మారారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధి నిరోధకులుగా పాలక వర్గం: మంచిరెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

హయత్‌నగర్‌,జూలై 26 (ఆంధ్రజ్యోతి): తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పాలకవర్గం అభివృద్ధి నిరోధకులుగా మారారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మన్నెగూడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషనర్‌ తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా నిరూపించాలని.. లేదా పై అధికారులకు ఫిర్యాదు చేయాలి. అలా చేయకుండా చైర్మన్‌గా ఉన్న వ్యక్తి ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎంపీ తన స్థాయి మరిచి కమిషనర్‌ను బదిలీ చేయాలని ధర్నా చేస్తారా, ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. కమిషనర్‌ను మార్చే అవకాశం లేదన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య, కౌన్సిలర్‌లు కళ్యాణ్‌నాయక్‌, స్వాతి, సంగీత, కీర్తన, జ్యోతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కందాడి ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

అర్హులైనా ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు 

అబ్దుల్లాపూర్‌మెట్‌, జూలై 27 (ఆంధ్రజ్యో తి): శివ గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ రేఖామహేందర్‌గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 1303 మందికి రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్‌ సైదులు, పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపాలిటీ వైస్‌ చైర్‌పర్సన్‌ చామ సంపూర్ణరెడ్డి, వైస్‌ ఎంపీపీ కొలన్‌ శ్రీధర్‌రెడ్డి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య, వంగేటీ లక్ష్మారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T06:20:05+05:30 IST