Abn logo
Mar 30 2020 @ 04:45AM

కాలి నడకన స్వగ్రామానికి..

విజయపురిసౌత్‌, మార్చి 29: ఓ వైపు కాలి నడక.. మరోవైపు తలపై బరువుతో తమ స్వగ్రామమైన నల్గొండ జిల్లా దేవరకొండ తాలూకా జూడాబాయి తండాకు వెళ్తున్నారు వలస కూలీలు. తెలంగాణ రాష్ట్రంలోని నెడుగు మండలం జూడాబాయి తండాకు చెందిన సుమారు 50 మంది బతుకుదెరువు నిమిత్తం పొందుగుల వద్ద ఉన్న గోపాలవారానికి వచ్చారు. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో వ్యవసాయ కూలీ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో చేసేది లేక తిరుగు పయనమయ్యారు.  శుక్రవారం అక్కడి నుంచి బయలుదేరిన వీరు ఆదివారం నాటికి విజయపురిసౌత్‌కు చేరుకున్నారు. టీ జంక్షన్‌ వద్ద అంతరాష్ట్ర చెక్‌పోస్టు దాటేందుకు అధికారులు అంగీకరించకపోవడంతో అక్కడే నిలిచిపోయారు. 

Advertisement
Advertisement
Advertisement