Advertisement
Advertisement
Abn logo
Advertisement

నీటి ప్రాజెక్టుల పరిరక్షణకు టీడీపీ పోరాటం

జగన లాలూచీతో రాయలసీమ  నాశనం

నీటి ప్రాజెక్టుల పరిరక్షణకు టీడీపీ పోరాటం

17న హిందూపురంలో రాయలసీమ నేతల సదస్సు

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

అనంతపురం వైద్యం, అక్టోబరు14: ముఖ్యమంత్రి జగన లాలూచీ, అసమర్థతతో నీటి ప్రాజెక్టులు కేంద్రం, తెలంగాణకు ధారదత్తం చేసి రాయలసీమను నాశనం చేశారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో మండి పడ్డారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీటి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ(కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌) పరిధిలోకి తీసుకొని గెజిట్‌ అమలుకు అడుగులు వేస్తున్నారన్నారు. 3నెలల పాటు మాత్రమే ప్ర స్తుత విధానం అమలు జరిగే అవకాశం ఉందన్నారు. దీం తో ఆంధ్రప్రదేశలో ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరగబోతుందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ విషయాల్లో ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి తమకు అన్యాయం జరగకుండా చర్చించుకున్నారన్నారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన ఏ మాత్రం పట్టించు కోలేదన్నారు. కేసుల భయంతో కేంద్రాన్ని ప్రశ్నించకపోగా తెలంగాణతో లాలూచీ పడటం వల్లే రాష్ట్రానికి ఈ పరి స్థితి వచ్చిందని ఆరోపించారు. కృష్ణా నదిపై మొత్తం 49 ప్రాజెక్టులు ఉండగా అందులో 15 ప్రాజెక్టులను కేఆర్‌ఎం బీ పరిధిలోకి వెళ్లిపోయాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ నీటికి ఎలాంటి సమస్యలు రావని చెబుతోంది. ఇంత జరుగుతున్నా రాయలసీమవాసిగా సీఎం జగన ఏం చేస్తు న్నారని కాలవ ప్రశ్నించారు. రాయలసీమకు 120 టీఎంసీ లు తీసుకోవడానికి అవకాశం ఉన్నా ఇప్పటికీ 60 శాతం మాత్రమే నీటిని తీసుకుంటున్నామన్నారు. ఇప్పుడు కేంద్ర నిర్ణయంతో రాయలసీమ భవిష్యత్తు నాశనం కాబోతోంద న్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.   ఇందులో భాగంగానే టీడీపీ నీటి ప్రాజెక్టుల పరిరక్షణకు రాయలసీమ స్థాయిలో పోరాటాలకు శ్రీకారం చుట్టిందన్నా రు. ప్రతి జిల్లాలోనూ రాయలసీమ నేతలతో సదస్సులు ని ర్వహించి అభిప్రాయాలు తీసుకొని భవిష్యత పోరాటాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ నెల 17న హిందూ పురంలో రాయలసీమ ప్రాజెక్టుల పరిరక్షణపై రాయల సీమ నేతలతో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.  ఈ ఉద్య మాలకు అన్ని వర్గాలు అండగా నిలవాలని అప్పుడే ప్రా జెక్టుల పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. అధికార పార్టీ రాయలసీమ ప్రజా ప్రతినిధులు ఈ అన్యాయంపై నోరు మెదపాలని లేకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. 

Advertisement
Advertisement