పోటెత్తుతున్న ధాన్యం వాహనాలు

ABN , First Publish Date - 2021-06-15T05:22:17+05:30 IST

పోటెత్తుతున్న ధాన్యం వాహనాలు

పోటెత్తుతున్న ధాన్యం వాహనాలు
అమిత్‌ కాటన్‌ మిల్లు గోడౌన్‌ వద్ద భారులు తీరిన ధాన్యం వాహనాలు

  • అన్‌లోడ్‌కు రైతుల నిరీక్షణ

షాద్‌నగర్‌ అర్బన్‌: ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం నిల్వ చేస్తున్న గోడౌన్ల వద్దకు వాహనాలు పోటెత్తుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు వందల సంఖ్యల్లో వాహనాలు వ చ్చి రోజుల తరబడి నిరీక్షిస్తున్నాయి. 20రోజుల నుంచి రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. షాద్‌నగర్‌ మార్కెట్‌ యార్డు కొనుగోలు కేంద్రంలో సోమవారం వరకు 73,000 బస్తాల ధాన్యం కొన్నారు. అయినా వేలాది బస్తాల ధాన్యం వస్తోంది. ఇప్పటికే రైస్‌ మిల్లుతో పాటు రెండు గోడౌన్లు నిండిపోవడంతో బాలనగర్‌ సమీపంలోని అమిత్‌ కాటన్‌ మిల్లు గోడౌన్‌ను తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి ఈ గోడౌన్‌కు ధాన్యం బస్తాల ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు వస్తున్నాయి. అయితే గోడౌన్‌లో స్థలం ఉన్నా... బస్తాలు దింపుకోడానికి హమాలీలు లేక వాహనాలు ఖాళీ కాక వాహనాలు బారులు తీరుతున్నాయి. హమాలీలను రప్పించి త్వరగా అన్‌లోడ్‌ చేయించాలని రైతులు కోరుతున్నారు. రైతులు అమిత్‌ కాటన్‌ మిల్లు వద్దకే ధాన్యం తేవాలని, వెంటనే హమాలీల సంఖ్యను పెంచి అన్‌లోడ్‌కు తగు చర్యలు తీసుకుంటామని కొనుగోలు అధికారి వెంకటయ్య తెలిపారు.


  • రోడ్డెక్కిన రైతులు.. కాంగ్రెస్‌ నాయకుల మద్దతు


తాండూరు: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని తాండూరు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. సోమవారం తాండూరు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో రైతులు రోడ్డుపైకొచ్చి నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు రైతులతో ధర్నాలో పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ పంట కొనుగోళ్లు, తరలింపుల్లో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రైతులు కేంద్రాల వద్దే రోజుల తరబడి వేచి ఉంటున్నారని, సంచికి ఆరేడు కిలోల తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకూ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని తె లిపారు. ధర్నాలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్‌, బీజేపీ కౌన్సిలర్‌ లలిత, ఎన్‌ఎ్‌సయూఐ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంకిత్‌ అనురాగ్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు కావలి సంతోష్‌, మొయిన్‌, అహ్మద్‌, భారీ సంఖ్యలో ధాన్యం రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T05:22:17+05:30 IST