అమ్మా.. దుర్గమ్మా..

ABN , First Publish Date - 2022-09-28T05:14:06+05:30 IST

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండో రోజు మంగళవారం పట్టణాలు, గ్రామాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు.

అమ్మా.. దుర్గమ్మా..
భీమవరంలో బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన అమ్మవారు

బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన అమ్మవారు


భీమవరం టౌన్‌, సెప్టెంబరు 27: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండో రోజు మంగళవారం పట్టణాలు, గ్రామాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. పంచామారామ క్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయంలో పార్వతీ దేవి, శ్రీరాంపురం జగన్మాత శ్రీచక్రసహిత కనకదుర్గ, భీమేశ్వరస్వామి ఆలయం లో మహిషాసుర మర్ధిని అమ్మవార్లు బాలా త్రిపుర సుందరిగా దర్శనం ఇచ్చారు. మెంటే వారితోట బాలాత్రిపుర సుందరిని గాయత్రిదేవిగా అలంకరించారు.


ఆకివీడు : స్థానిక పెద్దింట్లమ్మ, వనువులమ్మ ఆలయాలతోపాటు ఆర్యవైశ్య కళ్యాణమందిరంలో ఏర్పాటుచేసిన కనకదుర్గమ్మకు మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. బాలా త్రిపురసుందరిగా అమ్మవారు దర్శనమిచ్చారు. కాళ్ళ మండలం కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీలక్ష్మి అమ్మవారిని ధాన్యలక్ష్మిగా అలంకరించారు. ఉదయం శ్రీలక్ష్మి అమ్మవారికి పంచామృత శ్రీచక్ర అభిషేకం, కలశస్థాపన, మండపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ధాన్యలక్ష్మి అమ్మవారికి సహస్రనామ సామూహిక కుంకుమ పూజలు చేశారు. ఉండి మండలంలో అమ్మవార్లకు భక్తులు పూజలు చేశారు. 


తాడేపల్లిగూడెం: బలుసులమ్మ, దేవి మహంకాళమ్మ, ముత్యాలంబపురంలో ముత్యాలమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. వాసవి కన్యకాపరమేశ్వరి పంచా యతన క్షేత్రంలో వాసవి మాతకు విశేష అలంకారం చేశారు. వీరంపాలెం బాల త్రిపుర సుందరి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో దర్శనమిచ్చారు.


పాలకొల్లులో వాసవీమాత



పాలకొల్లు అర్బన్‌: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం పట్టణంలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. క్షీరా రామలింగే శ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంక రించారు. ఈవో సూర్యనారాయణ, చైర్మన్‌ కోరాడ శ్రీనివాసరావు, ట్రస్టీలు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. వాసవీ ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో చిన్నగోపురం వీధిలోని కళ్యాణ మండపంలో  అమ్మవారి ని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. యడ్ల బజారులోని కనక దుర్గమ్మకు మహిళలు కుంకుమ పూజలు చేశారు. రత్నామాంబాదేవి, దేశాలమ్మ, మావుళ్లమ్మ, ముఖదారమ్మ, మావూరమ్మ ఆలయాల్లో అమ్మవార్లకు పూజలు చేశారు.

Updated Date - 2022-09-28T05:14:06+05:30 IST