తీరని ఇసుక కష్టం

ABN , First Publish Date - 2020-07-05T11:36:07+05:30 IST

అధికారులు చెప్పేదానికి.. ఆచరణలోకి వచ్చే దానికి పొం తన ఉండడం లేదు.. దీనికి ఇసుకే నిదర్శనం.. ప్రస్తుతం జిల్లాలో ఇసుక సమస్య అంతా

తీరని ఇసుక కష్టం

కోడేరులో ఇసుక నిల్‌.. బుకింగ్‌ ఫుల్‌


ఆచంట జూలై 4 : అధికారులు చెప్పేదానికి.. ఆచరణలోకి వచ్చే దానికి పొం తన ఉండడం లేదు.. దీనికి ఇసుకే నిదర్శనం.. ప్రస్తుతం జిల్లాలో ఇసుక సమస్య అంతా ఇంతా కాదు.. ఏ ఒక్కరూ పరిష్కరించలేని సమస్యగా మారింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలకు నేటికి పూర్తిస్థాయిలో ఇసుక అందని పరిస్థితి నెలకొంది. దాదాపు జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.


ఇటీవల కోడేరు ర్యాంపు నుంచి ఇసుక కోసం వందల సంఖ్యలో ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకున్నారు. ర్యాంపు, స్టాక్‌ పాయింట్‌ రెండు చోట్ల ఇసుక లేకపోవడంతో ఇసుక కోసం వచ్చిన వాహనాలు శనివారం క్యూలో ఉండిపోయాయి. అధికారుల నుంచి ముందస్తు సమాచారం లేకపోవడంతో స్టాక్‌ పాయింట్‌ వద్ద ఇసుక లేకఅనేక మంది వెనుదిరిగారు. సుమారు వారం కిందట కోడేరు ర్యాంపు నుంచి ఇసుక సరఫరా నిలిచిపోవడంతో భవన యజమానులే ఆందోళనకు దిగారు.


అప్పట్లో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సమస్యను సర్దు బాటు చేశారు.ఆ తరు వాత ఇసుక సరఫరా క్రమంగా సాగింది. మళ్లీ శనివారం సమస్య వచ్చి పడింది. రెండురోజులుగా వర్షం కురుస్తున్న కారణంగా స్టాక్‌ పెట్టడానికి వీలు కుదరలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2020-07-05T11:36:07+05:30 IST