దేశ వైభవానికి సాహిత్యమే ప్రతిబింబం

ABN , First Publish Date - 2021-11-06T06:06:21+05:30 IST

నగరంలో వున్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

దేశ వైభవానికి సాహిత్యమే ప్రతిబింబం
‘విశాఖ సాహితీ’ స్వర్ణోత్సవ సంచికను ఆవిష్కరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. చిత్రంలో ఏయూ వీసీ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి, విశాఖ సాహితీ అధ్యక్షురాలు ప్రొఫెసర్‌ కోలవెన్ను మలయవాసిని ఉన్నారు.

నగరంలో వున్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శ్రీవిశ్వవిజ్ఞానవిద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి ఉమర్‌ అలీషా జీవితచరిత్ర, పార్లమెంట్‌ ప్రసంగాలకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ఏయూ డాక్టర్‌ వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో జరిగిన మరో కార్యక్రమానికి హాజరై ‘విశాఖ సాహితీ’ స్వర్ణోత్సవ సంచికను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఒక దేశ వైభవానికి, పరిణితికి ఆ దేశ సాహిత్యమే ప్రతిబింబమన్న ఆయన...కవులు, రచయితలు, విలేఖరులు, మేధావులు రాసే ప్రతి అక్షరంలోనూ సమాజ హితం ప్రతిబింబించాలని తెలిపారు.

Updated Date - 2021-11-06T06:06:21+05:30 IST