దిశ యాప్‌పై అవగాహన

ABN , First Publish Date - 2022-05-19T02:52:40+05:30 IST

మహిళలతో పాటు కళాశాలలకు వె ళ్లే విద్యార్థినులు దిశ యాప్‌ను తప్పనిసరిగా తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ఎస్‌ఐ

దిశ యాప్‌పై అవగాహన
కలిగిరి : దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సెల్‌ చూపుతున్న విద్యార్థినులు

కలిగిరి, మే 18: మహిళలతో పాటు కళాశాలలకు వె ళ్లే విద్యార్థినులు దిశ యాప్‌ను తప్పనిసరిగా  తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ఎస్‌ఐ సూర్యప్రకా్‌షరెడ్డి పేర్కొన్నారు.  బుధవారం పట్టణవాసులతోపాటు స్థానిక షిర్డీసాయిరాం డిగ్రీ కళాశాల విద్యార్థులకు  దిశయా్‌పపై అవగాహన కలిగించారు.  కార్యక్రమంలో పోలీసు సిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు.

 

వీకే పాడులో...


వరికుంటపాడు, మే 18:  దిశ యాప్‌ మహిళలకు ఎంతో రక్షణగా నిలుస్తుందని ఎస్‌ఐ బాలమహేంద్రనాయక్‌ అన్నారు. బుధవారం స్ధానిక పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.  అనంతరం జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు, ప్రజలకు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. కార్యక్రమంలో పోలీసులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


ఉదయగిరిలో..


ఉదయగిరి రూరల్‌, మే 18: సెలఫోన్‌లో దిశ యాప్‌ ఉంటే పోలీసు మీవెంట ఉన్నట్టేనని ఉదయగిరి సీఐ గిరిబాబు సూచించారు. ఆయన బుధవారం దిశ యాప్‌పై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు అంకమ్మ, లతీపున్నీసా, ఏఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


 కావలిలో..


కావలి, మే18: కావలి ఒకటో పట్టణ, రెండోపట్టణ, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో పోలీసులు బుధవారం దిశ యాప్‌ రిజిష్ట్రేషన్‌పై  మెగా డ్రైవ్‌ నిర్వహించారు. పట్టణంలోనూ, రూరల్‌లోనూ మహిళలకు దిశ యాప్‌పై అవగాహన కల్పించారు. ఒకటో పట్టణ సీఐ శ్రీనివాసరావుకు రెండు వేలు లక్ష్యం ఇవ్వగా, డౌన్‌లోడ్‌ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు అంబేద్కర్‌, మహేంద్ర, బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. టూటౌన్‌ సీఐ మల్లికార్జురావుకు 3వేలు లక్ష్యం ఇవ్వగా, లక్ష్యానికి మించి 3.700 వరకు తమ పరిధిలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు నాగరాజు, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రూరల్‌ సీఐ ఖాజావళికి 2 వేలు లక్ష్యం కాగా ఆయన  రెండువేలు డౌన్‌లోడ్‌ చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు వెంకట్రావు, వీరేంద్రబాబు సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-05-19T02:52:40+05:30 IST