డిప్యూటీ మేయర్‌ పీఠం మహిళలకు దక్కేనా ?

ABN , First Publish Date - 2021-03-02T05:13:39+05:30 IST

కడప కార్పొరేషనగా అవతరించి పదిహేనేళ్లు దాటింది. ముచ్చటగా మూడో పాలకవర్గం కొలువుదీరేందుకు కార్పొరేషన ఎన్నికలు ఈనెల 10న జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలకు స్థానాలు కేటాయిస్తున్నారు. అయితే వారికి పదవులు కట్టబెట్టడంలో మాత్రం వివక్ష కొనసాగుతోంది.

డిప్యూటీ మేయర్‌ పీఠం   మహిళలకు దక్కేనా ?

రెండు పర్యాయాలు పురుషులకే అవకాశం

కార్పొరేటర్లుగా సగం నారీమణులే

మరి డిప్యూటీ మేయర్‌ పదవిలో వివక్ష ఎందుకో ?

(కడప - ఆంధ్రజ్యోతి): కడప కార్పొరేషనగా అవతరించి పదిహేనేళ్లు దాటింది. ముచ్చటగా మూడో పాలకవర్గం కొలువుదీరేందుకు కార్పొరేషన ఎన్నికలు ఈనెల 10న జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలకు స్థానాలు కేటాయిస్తున్నారు. అయితే వారికి పదవులు కట్టబెట్టడంలో మాత్రం వివక్ష కొనసాగుతోంది. మహిళలకు రిజర్వేషన తప్ప జనరల్‌ స్థానాల్లో వారికి అవకాశం కల్పించడం చాలా అరుదుగా వస్తోంది. ఇప్పుడు ఈ ఎన్నికల వేళ కార్పొరేషన డిప్యూటీ మేయర్‌ పదవిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మేయరు అభ్యర్థిగా మాజీ మేయరు సురే్‌షబాబునే వైసీపీ ఖరారు చేసింది. టీడీపీ తమ మేయర్‌ అభ్యర్థిగా తస్లిమాను ఎంపిక చేసింది. 


మహిళలే కీలకం

కడ ప కార్పొరేషన జనాభా 4.17 లక్షల పైచిలుకు ఉంది. 50 డివిజన్లు ఉన్నాయి. మొత్తం ఓట్లు 2,88,390 కాగా పురుషుల ఓట్లు 1,41,467, మహిళల ఓట్లు 1,46,827 ఉన్నాయి. 15, 29 డివిజన్లలో మాత్రమే మహిళల కంటే పురుషుల ఓట్లు ఆధిక్యంలో ఉన్నాయి. మిగతా 48 డివిజన్లలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 


డిప్యూటీ మేయరుపై వైసీపీలో చర్చ

కార్పొరేషనగా అవతరించిన తరువాత తొలిసారి ఎన్నికల్లో మేయరుగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, డిప్యూటీ మేయర్‌గా నబీరసూల్‌ పనిచేశారు. రెండోసారి ఎన్నికల్లో మేయరుగా సురే్‌షబాబు, డిప్యూటీ మేయరుగా ఆరిఫుల్లా కొనసాగారు. ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో డిప్యూటీ మేయరు అభ్యర్థిత్వాన్ని ఇంతవరకు వైసీపీ అఽఽధికారికంగా ప్రకటించలేదు. మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తామంటూ ప్రభుత్వం చెబుతోంది. నామినేటెడ్‌ పదవుల్లో కూడా సగం మహిళలకే కేటాయించారు. అలాంటప్పుడు మహిళా ఓట్లు అధికంగా ఉన్నా డిప్యూటీ మేయరు పదవిని ఎందుకు ప్రకటించడం లేదంటూ చర్చ సాగుతోంది. మహిళా దినోత్సవం రోజున మహిళల ఖ్యాతిని కీర్తించడం, రాజ కీయాల్లో పదవులు ఇస్తామనడం, రిజర్వేషన్లలో తప్ప మిగతా పదవుల్లో మహిళలకు ప్రాధాన్యతనివ్వడం లేదన్న విమర్శ వినిపిస్తోంది.  ఏదైనా మేయర్‌.. ! చైర్మన ! జిల్లా పరిషత చైర్మన ! మండలాధ్యక్షులు ! సర్పంచ పదవి మహిళలకు కేటాయిస్తే డిప్యూటీ చైర్మన, వైస్‌ చైర్మన్లను పురుషులకు కేటాయిస్తారు. మరి అదేవిధంగా డిప్యూటీ మేయరు పదవిని కూడా ఎందుకు మహిళలకు కేటాయించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొందరు నేతలకు రాజకీయ పదవులు కల్పించడం కోసమే మహిళల పట్ల వివక్ష చూపుతున్నారన్న విమర్శలు అధికార పార్టీలో వినవస్తున్నాయి. 

Updated Date - 2021-03-02T05:13:39+05:30 IST