ఫొన్‌లో తల్లి మాటలు విని ఉలిక్కిపడ్డ కొడుకు.. హుటాహుటిన ఇంటికి బయల్దేరాడు.. కానీ అతడు వచ్చే సరికే..

ABN , First Publish Date - 2022-04-09T02:00:09+05:30 IST

ఫ్యాక్టరీకి వెళ్లిన కొద్ది సమయానికి అతడికి ఇంటి నుంచి ఫోన్ వొచ్చింది. ఫోన్‌లో తన తల్లి మాటలు విని ఆ కొడుకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. హుటాహుటిన ఇంటికి బయల్దేరి వెళ్లాడు. అతడు అక్కడకు చేరుకునే సరి

ఫొన్‌లో తల్లి మాటలు విని ఉలిక్కిపడ్డ కొడుకు.. హుటాహుటిన ఇంటికి బయల్దేరాడు.. కానీ అతడు వచ్చే సరికే..

ఇంటర్నెట్ డెస్క్: ఫ్యాక్టరీకి వెళ్లిన కొద్ది సమయానికి అతడికి ఇంటి నుంచి ఫోన్ వొచ్చింది. ఫోన్‌లో తన తల్లి మాటలు విని  ఆ కొడుకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. హుటాహుటిన ఇంటికి బయల్దేరి వెళ్లాడు. అతడు అక్కడకు చేరుకునే సరికే  ఇంటి తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్నాయి. దీంతో అతడు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకయ్యాడు. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



సంగీత(54) అనే మహిళ తన కొడుకు రాహుల్, కోడలితో కలిసి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నివసిస్తోంది. కొన్ని నెలల క్రితమే భర్తను కోల్పోయిన ఆమె.. మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధం అయింది. ఉద్యోగానికి వెళ్లిన కొడుకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. దీంతో ఉలిక్కిపడ్డ రాహుల్.. హుటాహుటిన ఇంటికి బయల్దేరి వచ్చేశాడు. అయితే అతడు వచ్చే సరికి తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో వాటిని బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం ఇంట్లో ఫ్యాన్‌ను ఉరేసుకుని విగత జీవిగా వేలాడుతున్న తన తల్లిని చూసి రాహుల్ షాకయ్యాడు. కాగా.. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2022-04-09T02:00:09+05:30 IST