RCBలో పీహెచ్‌డీ, ఆర్‌ఏ ప్రోగ్రామ్‌లు

ABN , First Publish Date - 2022-07-01T21:46:40+05:30 IST

యునెస్కో సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (డీబీటీ) ఆధ్వర్యంలోని రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ

RCBలో పీహెచ్‌డీ, ఆర్‌ఏ ప్రోగ్రామ్‌లు

యునెస్కో సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ(Department of Biotechnology) (డీబీటీ) ఆధ్వర్యంలోని రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ(ఆర్‌సీబీ) - పీహెచ్‌డీ, రిసెర్చ్‌ అసోసియేట్‌షిప్(ఆర్‌ఏ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. 


పీహెచ్‌డీ: ఈ ప్రోగ్రామ్‌లో 25 సీట్లు ఉన్నాయి. స్ట్రక్చరల్‌ బయాలజీ, మాలిక్యులర్‌ మెడిసిన్‌, ఇన్ఫెక్షియస్‌ డిసీజ్‌ బయాలజీ, అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ, సిస్టమ్స్‌ అం డ్‌ సింథటిక్‌ బయాలజీ, క్యాన్సర్‌ అండ్‌ సెల్‌ బయాలజీ విభాగాలు ఎంచుకోవచ్చు. ప్రో గ్రామ్‌లో భాగంగా కోర్సు వర్క్‌లు, రిసెర్చ్‌ వర్క్‌, డాక్టోరల్‌ థీసిస్‌ వర్క్‌ ఉంటాయి.   

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్‌ సైన్సెస్‌/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్‌ విభాగాల్లో ఎంటెక్‌/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఎంఫార్మసీ/ ఎంవీఎస్సీ/ ఎంబీబీఎస్‌ పూర్తిచేసినవారు కూడా అర్హులే. పీజీ స్థాయిలో ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. సీఎ్‌సఐఆర్‌/ యూజీసీ/ డీఎస్‌టీ ఇన్‌స్పయిర్‌/ డీబీటీ/ ఐసీఎంఆర్‌ నుంచి జేఆర్‌ఎఫ్‌ అర్హత పొంది ఉండాలి. లేదా కేంద్రం జాతీయ స్థాయిలో అందించే అయిదేళ్ల వ్యవధిగల  ఏదేని ఫెలోషిప్‌ అర్హత ఉండాలి.

ఎంపిక: అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రిటెన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు. 

దరఖాస్తు ఫీజు: రూ.500(ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 8

రిటెన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు: జూలై 21, 22

రిసెర్చ్‌ అసోసియేట్‌షిప్‌: ఈ పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. గరిష్ఠంగా నాలుగేళ్ల వరకూ పొడిగించే వీలుంది.  బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ విభాగాలు ఎంచుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఫెలోషిప్‌, కంటింజెన్సీ గ్రాంట్‌, హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు. 

అర్హత: ఇంజనీరింగ్‌, సైన్స్‌ విభాగాల్లో పీహెచ్‌డీ; మెడిసిన్‌ విభాగాల్లో ఎండీ, ఎంఎస్‌ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే పీహెచ్‌డీ/ ఎండీ/ ఎంఎస్‌ థీసిస్‌ సబ్మిట్‌ చేసినవారు కూడా అర్హులే. అభ్యర్థుల వయసు దరఖాస్తు నాటికి పురుషులకు 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లు మించకూడదు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 15

వెబ్‌సైట్‌: rcb.res.in

Updated Date - 2022-07-01T21:46:40+05:30 IST