వ్యవసాయ శాఖ కొత్త బాస్‌ రాకపై సందిగ్ధం..!

ABN , First Publish Date - 2021-07-31T06:14:28+05:30 IST

జిల్లా వ్యవసాయ శాఖకు కొత్త బాస్‌ ఎప్పుడొస్తారో తెలియని అయోమయం నెలకొంది. కడప ఆత్మా పీడీ చంద్రానాయ క్‌ను జేడీఏగా నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం జీఓ జారీ చేసింది. సాధారణంగా జీఓ జారీ చేసిన ఒ కటి, రెండు రోజుల్లో కమిషనరేట్‌ నుంచి తగి న ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది

వ్యవసాయ శాఖ కొత్త బాస్‌ రాకపై సందిగ్ధం..!
జేడీఏగా నియమితుడైన చంద్రానాయక్‌

 జేడీఏగా చంద్రానాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ

పది రోజులు దాటినా కమిషనరేట్‌ నుంచి ఉత్తర్వులు ఇవ్వని వైనం 

అనంతపురం వ్యవసాయం, జూలై 30:  జిల్లా వ్యవసాయ శాఖకు కొత్త బాస్‌ ఎప్పుడొస్తారో తెలియని అయోమయం నెలకొంది. కడప ఆత్మా పీడీ చంద్రానాయ క్‌ను జేడీఏగా నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం జీఓ జారీ చేసింది. సాధారణంగా జీఓ జారీ చేసిన ఒ కటి, రెండు రోజుల్లో కమిషనరేట్‌ నుంచి తగి న ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ప్రభు త్వం జీఓ జారీ చేసి పది రోజులు దాటినా ఇ ప్పటి దాకా వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ కా ర్యాలయం నుంచి నియామకపు ఉత్తర్వులు ఇవ్వకపోవ డం గమనార్హం. ఈ పరిస్థితుల్లో కొత్త బాస్‌ వస్తారా..? లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

ఇన్‌చార్జి పాలనకు స్వప్తి చెప్పేరా..? 

గత కొన్నేళ్లుగా వ్యవసాయ శాఖలో ఇన్‌చార్జి పాలన కొనసాగుతోంది. ఇన్‌చార్జి అధికారి తీరు సవ్యంగా లేక పోవ డంతో ఆ శాఖలో పాలన గాడి తప్పిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ అధికారి జేడీఏ కార్యాలయానికి రా కుండా ఇంటి వద్ద నుంచే కార్యాలయ కార్యకలాపాలు నడిపిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లడం తి రిగి నేరుగా ఇంటికి వెళ్లిపోతున్నారనే వాదనలున్నాయి. పర్యటనకు వెళ్లని రోజుల్లో కూడా జేడీఏ కార్యాలయానికి రాకపోవడం గమనార్హం. వ్య వసాయ శాఖ చరిత్రలో గతంలో ఎన్న డూ లేని విధంగా జేడీఏ కార్యాలయానికి రాకుండా కార్యకలా పాలు నిర్వహిస్తున్న ఏకైౖక అధికారిగా ఆయన మచ్చ తెచ్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. వ్యవసాయ అధికారులు ఏ వైనా సమస్యలు చెప్పుకోవాలన్నా ఆ అధికారి ఇంటి వద్దకు వెళ్లాల్సిందే. కార్యాలయ ఫైల్స్‌ అన్ని ఇంటి వద్దకు తెప్పించుకొని సంతకాలు పెట్టి పంపిస్తున్నట్లు సమాచారం. దీంతో జేడీఏ కార్యాలయ అధికారులతోపాటు శాఖా పరమైన పనుల కోసం ఇంటి వద్దకు వెళ్లలేక జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పనిచేసే వ్యవసాయ అధికారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు సమాచారం. అయినా బయటకు చెప్పుకునేందుకు జంకుతున్నారు. వ్యవసాయ శాఖ బాస్‌ కార్యాలయంలోఅందుబాటులో లేకపోవడంతో రైతులు తమ సమస్యలను ఆయనకు చెప్పుకోలేకపోతున్నారు.  ముఖ్యంగా ఆ అధికారి రాష్ట్ర కార్యాలయం, కలెక్టరేట్‌, ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్‌ చేసి నా లిఫ్ట్‌ చేయరన్న విమర్శలున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖకు కొత్త బాస్‌ను నియమి స్తూ జీఓ జారీ చేయడంతో ఆయా వర్గాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. అంుుతే కమిషనరేట్‌ నుంచి ఉత్తర్వుల జారీలో జాప్యంతో ఏం రాజకీయం జరుగుతుందోననే అయోమయం నెలకొంది. 

Updated Date - 2021-07-31T06:14:28+05:30 IST