ఆన్‌లైన్‌ పాఠాలను టీవీలో చూసేలా ప్రోత్సహించండి

ABN , First Publish Date - 2020-09-27T10:47:16+05:30 IST

జిల్లాలో అమ లవుతున్న ఆన్‌లైన్‌ పాఠాలను పిల్లలు టీవీలో చూడ డా న్ని ప్రోత్సహించాలని జిల్లా విధ్యాశాఖాధికారి సోమశేఖర్‌ శర్మ ప్రా థమిక పాఠశాలల ఉపాధ్యాయులకు సూచించారు. శని వారం జిల్లాలోని

ఆన్‌లైన్‌ పాఠాలను టీవీలో చూసేలా ప్రోత్సహించండి

వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈవో సోమశేఖర శర్మ


కొత్తగూడెం కలెక్టరేట్‌, సెప్టెంబరు 26: జిల్లాలో అమ లవుతున్న ఆన్‌లైన్‌ పాఠాలను పిల్లలు టీవీలో చూడ డా న్ని ప్రోత్సహించాలని జిల్లా విధ్యాశాఖాధికారి సోమశేఖర్‌ శర్మ ప్రా థమిక పాఠశాలల ఉపాధ్యాయులకు సూచించారు. శని వారం జిల్లాలోని ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా డీఈవో మాట్లాడారు. పిల్లలు పాఠాలు విం టున్న తీరును పరిశీలించాలన్నారు. దీంతో పాటు పిల్లల ప్రగతి ని ఎప్పటికప్పుడు సమీక్షించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. పిల్లలకు నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వ హించాలని, దీనికోసం  పిల్లల ఇంటికి వెళ్లినప్పుడు వారి ప్రగ తిని  చిన్న చిన్న ప్రశ్నల ద్వారా, కొన్ని కృత్యాల ద్వారా  మూ ల్యాంకనం చేయాలన్నారు. బడిబయట ఉన్న పిల్లలను తప్పనిసరిగా బడిలో చేర్చించే బాధ్యత వహించాలన్నారు. పిల్లలు ఎవరికైనా టీవీలు లేకపోతే దాతల ద్వారా సమీకరించి వారికి అందజేయాలని సూచించారు. ఉపాధ్యాయులు ఎవరైనా కొత్త టీవీలు కొనుగోలు చేస్తే వారి పాత టివీలను పిల్లలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ సమావేశంలో  ప్రభు త్వ పరీక్షల సహాయ కార్యదర్శి రామేశ్వరరావు, ఆన్‌లైన్‌ తర గతుల జిల్లా మానిటరింగ్‌ ఇన్‌చార్జీ నాగరాజ శేఖర్‌, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, ఎంఈవోలు  పాల్గొన్నారు.


ఆన్‌లైన్‌ తరగతులను పరిశీలించాలి

సుజాతనగర్‌: విధ్యార్థుల ఆన్‌లైన్‌ తరగతులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని జిల్లా విధ్యాశాఖాధికారి సోమ శేఖరశర్మ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్న తీరు, విధ్యార్థుల స్పందన, వర్క్‌షీట్‌ విధానం తదితర అంశాలపై ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం చిట్లూరి వీరభద్రరావుని, ఉపాధ్యాయులను అడిగి తెలుకున్నారు. విద్యార్థుల ఆన్‌లైన్‌ తరగతులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. 

Updated Date - 2020-09-27T10:47:16+05:30 IST