రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2022-06-28T05:38:38+05:30 IST

రాష్ట్రంలో గత మూడేళ్లుగా రాక్షస పాలన సాగుతోందని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో రాక్షస పాలన
జలుమూరు: కరపత్రాలు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు

 


 ‘బాదుడే బాదుడు’లో టీడీపీ నేతలు

జలుమూరు, జూన్‌ 27: రాష్ట్రంలో గత మూడేళ్లుగా రాక్షస పాలన సాగుతోందని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ధ్వజమెత్తారు.  అక్కురాడ పంచాయతీ లత్సన్నపేట, కామినాయుడుపేట గ్రామాల్లో సోమవారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.  ఇంటింటికీ వెళ్లి వైసీపీ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ సర్కారు రాష్ట్రాన్ని అన్నివిధాల దోచుకుంటుందని విమర్శించారు. మద్యం, ఇసుక, భూములు మాఫియా సహకారంతో ప్రభుత్వం నడుస్తోందన్నారు. జగన్‌ సర్కారు అవినీతిలో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణ లోపించి రాష్ట్రంలో దోపిడీ పెరిగిందన్నారు. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర సరుకులు ధరలు పెరిగి సామాన్య ప్రజానీకం మనుగడకే ముప్పు వాటిల్లిందన్నారు.  వైసీపీ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో  ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  గ్రామస్థాయిలో టీడీపీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, నాయకులు బైరి భాస్కరరావు, పంచిరెడ్డి రామచంద్రరావు, దుంగ స్వామిబాబు, బగ్గు గోవిందరావు, తర్ర బలరాం, నక్క రమేష్‌, రామారావు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఇచ్ఛాపురం రూరల్‌: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడి బతుకు దుర్భరంగా మారిందని మాజీ ఎంపీపీ, ఏఎంసీ మాజీ చైర్మన్లు డి.ఢిల్లీరావు, సాడి సహదేవు రెడ్డి తెలిపారు. సోమవారం అరకపద్రలో టీడీపీ  నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్ర మంలో టీడీపీ నాయకులు డి.కామేష్‌, ఎల్‌.పద్మనాభం, బోర ప్రసాద్‌, కె.గోపి, ఎం.నారాయణ, గణపతి, పరశురాం, లోహిదాసు, హేమరాజు  పాల్గొన్నారు. 

 కవిటి: మండలంలోని డి.గొనపపుట్టుగలో టీడీపీ మండలాధ్యక్షుడు మణి చంద్రప్రకాష్‌ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం సోమవారం నిర్వ హించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో  జడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.కృష్ణారావు, బి.చినబాబు, బి.విజయకృష్ణ, ఎల్‌.శ్రీ ను, వాసుదేవు ప్రదాన్‌, కె.వాసు  పాల్గొన్నారు. 




  



Updated Date - 2022-06-28T05:38:38+05:30 IST