ఆక్రమణల కూల్చివేత

ABN , First Publish Date - 2021-06-24T05:28:10+05:30 IST

ఆక్రమణల కూల్చివేత

ఆక్రమణల కూల్చివేత
మోమిన్‌పేట బస్టాండు ఆవరణలో అక్రమ దుకాణాలను కూల్చివేయించిన దృశ్యం

మోమిన్‌పేట: బస్టాండ్‌ ప్రాంగణంలో అక్రమ కట్టడాలు చేపడితే చర్యలు తప్పవని వికారాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ దైవాదీనం అన్నారు. బుధవారం బస్టాండ్‌ ఆవరణలో వ్యాపారుల డబ్బాలను మండల పోలీస్‌ సిబ్బందితో కలిసి తొలగించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రాంగణంలో అక్రమ నిర్మాణాలు ని షిద్ధం అన్నారు. వచ్చిపోయే బస్సులకు అంతరాయం కలుగుతుందని, అక్రమ కట్టడాలను తొలగించామన్నారు. ఇప్పటికే వారికి పలుమార్లు నోటీసులిచ్చినా ప్రయోజనం లేదని, అందుకే కూల్చేశామన్నారు.

Updated Date - 2021-06-24T05:28:10+05:30 IST