Advertisement
Advertisement
Abn logo
Advertisement

గౌడవెల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

మేడ్చల్‌: అక్రమ నిర్మాణాలపై అధికారులు స్పందించారు. ‘గౌడవెల్లిలో అక్రమ వెంచర్లు’ అనే  శీర్షికతో శనివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి  అధికారుల్లో కదలిక వచ్చింది.  గౌడవెల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌ 557లో నిబంధనలకు విరుద్ధ్దంగా వెంచర్‌ చేస్తున్నారు. ఎంపీవో వినూత్న, ఇన్‌చార్జి కార్యదర్శి శరత్‌ ఆక్రమ వెంచర్‌లోని  నిర్మాణాలను ఎక్సవేటర్‌, సిబ్బంది సాయంతో కూల్చివేతలు చేపట్టారు. ఈసందర్బంగా ఎంపీవో వినూత్న మాట్లాడుతూ ఆక్రమ వెంచర్లు, ఆక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పెంటమ్మ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement