Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌

కందుకూరు, నవంబరు 26 : రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల్లో రైతు నాయకులు ఉండాలని డిమాండ్‌ చేస్తూ, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం శుక్రవారం ధర్నా నిర్వహించారు. సీపీఎం, సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో రైతునాయకులు మాట్లాడుతూ..కేంద్రం రైతులను నష్టపరిచే చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించుకున్నప్పటికి పూర్తి స్ధాయిలో ఆప్రక్రియను పూర్తి చేయలేదని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర అందించేలా మద్దతు ధరల నిర్ణయాన్ని పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా మద్ధతు  ధర నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో సీపీఎం నాయకులు ముప్పరాజు కోటయ్య, మువ్వా కొండయ్య, ఎస్‌ఏ గౌస్‌, మున్వర్‌ సుల్తానా, ఎస్‌కే మల్లిక, బీ రామూర్తి, ఎస్‌ పవన్‌ కుమార్‌, సీపీఐ నాయకులు ఎస్‌ రావమ్మ, సుభాను, బాల బ్రహ్మాచారి, తదితరులు పాల్గొన్నారు.

కనిగిరి : వ్యవసాయ నల్లచట్టాల రద్దు బిల్లు వచ్చే వరకు పోరాటం ఆగదని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు గుజ్జుల బాలిరెడ్డి, కేశవరావులు అన్నారు. స్థానిక పులి వెంకటరెడ్డి పార్కు వద్ద నల్లచట్టాల బిల్లు రద్దుతో పాటు, పోరాటంలో చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు పాల్గొని నిరసన దీక్షలు చేపట్టిన వారికి పూలదండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ నల్లచట్టాల రద్దు కోసం రైతులు ఢిల్లీలో ఏడాది పాటు అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఆ సమయంలో 750 మంది రైతులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారని, తక్షణమే వారికి రూ. 50లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తొలుత కనిగిరి పట్టణంలో సీఐటీయూ, ఐద్వా, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రైతు సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ హనీఫ్‌, పిల్లి తిప్పారెడ్డి, జీపీ రామారావ కె వెంకటేశ్వర్లు, శ్రీరాములురెడ్డి, మునయ్య, శ్రీను, ఓంకారం, ఖాశీంవలి, ఖాదర్‌వలి తదితరులు దీక్షలను చేపట్టారు. 

పామూరు, గుడ్లూరు, దర్శి, ముండ్లమూరు మండలాల్లోనూ సాగు చట్టాలను రద్దుచేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

Advertisement
Advertisement