Abn logo
Aug 1 2021 @ 01:25AM

నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

మన్సూరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ అభివృద్ధి, దళితుల అభ్యున్నతి కోసం ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ అంబేడ్కర్‌ యువజన సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎల్‌బీనగర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకుడు బాణాల ప్రవీణ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ప్రజల రుణం తీర్చుకునే మంచి అవకాశం సుధీర్‌రెడ్డికి లభించిందన్నారు. ఆయన రాజీనామాతో నియోజకవర్గ ప్రజలకు దళిత బంధు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, పింఛన్లు, రేషన్‌ కార్డులు తదితర పథకాలు వెంటనే అమలవుతాయన్నారు. ఉప ఎన్నికలు వస్తే మళ్లీ తాము సుధీర్‌రెడ్డిని గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో పారంద మహేశ్‌, కందుకూరి సుదర్శన్‌, గుండె కిరణ్‌కుమార్‌, కిన్నెర కుమార్‌, ఎర్రన్న, డప్పు రాజు, భాస్కర్‌, దుప్పల్లి నర్సింహ పాల్గొన్నారు.

హైదరాబాద్మరిన్ని...