‘డెల్టా’ కార్మికుల నిరసన దీక్ష

ABN , First Publish Date - 2022-05-28T06:02:31+05:30 IST

డెల్టా పేపర్‌ మిల్లు మూసివేతను నిరసిస్తూ కార్మికులు చేపట్టిన రిలే నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి.

‘డెల్టా’ కార్మికుల నిరసన దీక్ష
నిరసన దీక్ష చేస్తున్న జేఏసీ నాయకులు

పాలకోడేరు, మే 27: డెల్టా పేపర్‌ మిల్లు మూసివేతను నిరసిస్తూ కార్మికులు చేపట్టిన రిలే నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాటికి దీక్షలు 108వ రోజుకు చేరాయి. కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ పేపర్‌ మిల్లు మూసివేతతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. మిల్లు తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 29న ఆదివారం ఉదయం 10గంటలకు భీమవరం ఎంపీ డీవో కార్యాలయం ఎదురుగా యూటీఎఫ్‌ భవనంలో డెల్టా పేపర్‌మిల్లు సమస్యపై సమావేశం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులతో అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసినట్ల్లు జేఏసీ నాయకులు వైఎస్‌ఎన్‌ మూర్తి, భద్రం తెలియజేశారు.

Updated Date - 2022-05-28T06:02:31+05:30 IST