ప్రభుత్వ ఆసుపత్రి బాత్‌రూమ్‌లో డెలివరీ

ABN , First Publish Date - 2020-12-01T05:15:20+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రి బాత్‌రూమ్‌లో డెలివరీ

ప్రభుత్వ ఆసుపత్రి బాత్‌రూమ్‌లో డెలివరీ

వికారాబాద్‌:  పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన మహిళ ఆసుపత్రి బాత్‌ రూమ్‌లో డెలవరీ అయిన సంఘటన వికారాబాద్‌ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వికారాబాద్‌ పట్టణానికి చెందిన  మహిళా పురిటి నొప్పులు రావడంతో  సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడ పరిశీలించిన వైద్యులు పురిటి నొప్పులు పెరిగే వరకు చూద్దామని చెప్పారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఇక్కడ సదుపాయాలు లేవు హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించడంతో మహిళ కుటుంబ సభ్యులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతలోనే మహిళ  పురిటి నొప్పులు ఎక్కువడంతో బాత్‌ రూమ్‌లోనే శిశువుకు జన్మనించింది.  ముందే చెబితే హైదరాబాద్‌ వెళ్లే వారమని, ఇలా బాత్‌ రూమ్‌లో బిడ్డ పుట్టేది కాదని, బాలింత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.  వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలి బంధవులు ఆరోపించారు. ఈ విషయమైన వైద్యులను వివరణ కోరగా సదరు మహిళకు హెచ్‌ఐవీ ఉందనే విషయాన్ని ముందు చెప్పలేదని, రక్త పరీక్షల్లో నిర్ధారణ కావడంతో ఇక్కడ కిట్లు లేవని అందుకే హైదరాబాద్‌ వెళ్లాలని సూచించడం జరిగిందన్నారు. ముందే హెచ్‌ఐవీ ఉన్నట్లు చెప్పినట్లయితే అప్పుడు హైదరాబాద్‌కు రెఫర్‌ చేసే వారమని, వారు విషయం దాచి ఉంచడం వల్లే ఇలా జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-01T05:15:20+05:30 IST